Thursday, June 18, 2026
HomeసినిమాKarthi: ‘జపాన్’ ఇంట్రో గ్లింప్స్ విడుదల

Karthi: ‘జపాన్’ ఇంట్రో గ్లింప్స్ విడుదల

వరుస హిట్లతో దూసుకుపోతున్న హీరో కార్తీ ప్రస్తుతం ‘జోకర్’ ఫేమ్ రాజు మురుగన్ దర్శకత్వంలో అవుట్ అండ్ అవుట్ అడ్వెంచరస్ థ్రిల్లర్ ‘జపాన్’ చేస్తున్నారు. డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌ పతాకంపై ఎస్‌ఆర్‌ ప్రకాష్‌బాబు, ఎస్‌ఆర్‌ ప్రభు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం కార్తీ 25వ చిత్రం. కార్తీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ సినిమాలో అతని పాత్ర ఇంట్రో గ్లింప్స్ ని విడుదల చేశారు. కార్తీని జపాన్‌గా పరిచయమయ్యారు. ఇందులో ఓ పెక్యులర్ పాత్రలో నటిస్తున్నారు. అతని గురించి వేర్వేరు వ్యక్తులకు విభిన్న అభిప్రాయాలను వుంటాయి. ముగ్గురు డిఫరెంట్ వ్యక్తులకు అతను హీరో, కమెడియన్, విలన్.

కార్తీ గ్లింప్స్‌లో గిరజాల జుట్టుతో డిఫరెంట్ లుక్‌లో హిలేరియస్ గా కనిపించారు.  గ్లింప్స్  భోరసా ఇస్తున్నట్లు జపాన్ అడ్వంచర్ రైడ్‌ను అందించబోతోంది. మేకర్స్ అనౌన్స్ చేసినట్లుగా జపాన్ ఈ సంవత్సరం దీపావళికి  విడుదల కానుంది. తొలిసారిగా కార్తీ సరసన అను ఇమ్మాన్యుయేల్‌ నటిస్తోంది. సునీల్ కీలక పాత్రలో కనిపించనున్న ఈ చిత్రంలో ప్రముఖ సినిమాటోగ్రాఫర్ విజయ్ మిల్టన్ తొలిసారిగా నటిస్తున్నారు. ఈ గ్లింప్స్ కు పాజిటివ్ రెస్సాన్స్ వచ్చింది. మరి.. ఈ సినిమాతో కార్తి మరో విజయం సాధిస్తాడేమో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular