పవన్ కళ్యాణ్ వరుసగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీ అయ్యారు. ఇటీవల విడుదల చేసిన  ‘బ్రో’  మోషన్ పోస్టర్ కు అనూహ్య స్పందన వచ్చింది. దీంతో బ్రో మూవీ పై  అంచనాలు  ఇంకా పెరిగాయి. ఈ చిత్రానికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే – సంభాషణలు అందించడం విశేషం. ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మిస్తుంది. జులై 28న ఈ సినిమాను విడుదల చేయనున్నారు.

అయితే.. ఈ సినిమాతో పాటు ‘ఓజీ’ అనే సినిమాను కూడా చేస్తున్నారు. సాహో డైరెక్టర్ సుజిత్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని ఆర్ఆర్ఆర్ ప్రొడ్యూసర్ డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ముంబాయిలో ఆమధ్య పవన్ కళ్యాణ్ పై కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. అయితే.. బ్రో సినిమా ప్యాచ్ వర్క్ బ్యాలెన్స్ ఉండడంతో  దీనికి డేట్స్ ఇచ్చారు. తర్వాత ఓజీకి  ఏకధాటిగా ఈ చిత్రానికి డేట్స్ ఇవ్వనున్నట్టు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది.

ఎందుకంటే.. అక్టోబర్ కి ఓజీ మూవీ షూటింగ్ కంప్లీట్ చేయాలనుకుంటున్నారట. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా ఫాస్ట్ గా కంప్లీట్ చేసి డిసెంబర్ లోనే విడుదల చేయాలనేది ప్లాన్ అని తెలిసింది.  అసలు ప్లాన్ ప్రకారం కొత్త సంవత్సరంలో ఓజీ రిలీజ్ చేయాలి అనుకున్నారు కానీ.. ఇప్పుడు ప్లాన్ మారిందని టాక్. ఈ సంవత్సరంలో జులై లో బ్రో, డిసెంబర్ లో ఓజీ ఇలా పవన్ నుంచి రెండు సినిమాలు రిలీజ్ అయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నారు. అంతా అనుకున్నట్టుగా జరిగి బ్రో, ఓజీ సినిమాలు రిలీజ్ అయితే.. పవర్ స్టార్ అభిమానులకు పండగే అని చెప్పచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *