మహేష్‌ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో మూవీ అనగానే… అటు అభిమానుల్లోనూ, ఇటు ఇండస్ట్రీలోనూ భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ప్రముఖ నిర్మాణ సంస్థ హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై రాధాకృష్ణ నిర్మిస్తున్న  ఈ సినిమాలో మహేష్ కు జంటగా పూజా హేగ్డే, శ్రీలీల నటిస్తున్నారు. ఎస్ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు.

అయితే.. ఈ సినిమా ఇప్పటివరకు రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకుంది. తాజా షెడ్యూల్ జూన్ నుంచి స్టార్ట్ కానుంది. ఈ మూవీ టైటిల్  ‘అమరావతికి అటు ఇటు’, ‘అయోధ్యలో అర్జునుడు’, ‘గుంటూరు కారం’, ‘ఊరికి మొనగాడు’.. ఇలా కొన్ని టైటిల్స్ ప్రచారంలోకి వచ్చాయి. ఉగాదికి ఈ సినిమా టైటిల్ అనౌన్స్ చేయాలనుకున్నారు కానీ సాధ్యం కాలేదు. కృష్ణ జయంతి సందర్భంగా మే 31న ఈ మూవీ టైటిల్ ప్రకటిస్తామని నిర్మాణ సంస్థ గతంలో ప్రకటించింది.

లోడింగ్ అంటూ పవర్ ఫుల్ ఎమోజిని జత చేసి తమ సోషల్ మీడియా అకౌంట్స్ లో మేకర్స్ ఒక పోస్ట్ చేశారు. భారీ అంచనాలున్న ఈ క్రేజీ కాంబో మూవీ టీజర్ వస్తుందని.. దీంతో పాటు టైటిల్ కూడా ప్రకటిస్తారని సూపర్ స్టార్ అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రేజీ మూవీని 2024 జనవరి 13న గ్రాండ్ గా విడుదల చేయనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *