Tuesday, June 16, 2026
Homeస్పోర్ట్స్WI Vs. UAE: విండీస్ దే వన్డే సిరీస్

WI Vs. UAE: విండీస్ దే వన్డే సిరీస్

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తో జరిగిన రెండో వన్డేలోనూ వెస్టిండీస్ 78 పరుగులతో ఘన విజయం సాధించి సిరీస్ ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే కైవసం చేసుకుంది. షార్జా క్రికెట్ స్టేడియంలో జరిగిన నేటి మ్యాచ్ లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ 49.5 ఓవర్లలో 306 పరుగులు చేసింది. జాన్సన్ చార్లెస్ 47 బంతుల్లో 8 ఫోర్లు, 3  సిక్సర్లతో 63; బ్రాండన్ కింగ్ 70 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 64; ఓడియన్ స్మిత్ 37; కీసీ కార్టీ 32 పరుగులతో రాణించారు. యూఏఈ బౌలర్లలో జహూర్ ఖాన్ 3; అలీ నాజర్, సంచిత్ శర్మ, అఫ్జల్ ఖాన్ తలా రెండు; ఆదిత్య శెట్టి ఒక వికెట్ పడగొట్టారు.

ఆ తర్వాత యూఏఈ 15 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. జట్టులో అలీ నాజర్-57; బాసిల్ హమీద్ 49; వి. అరవింద్ 36; అఫ్జల్ ఖాన్ 25; ఆర్యాన్ష్ శర్మ 20 పరుగులు చేశారు. 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 228 పరుగులే చేయగలిగింది.  విండీస్ బౌలర్లలో హోడ్గే, రోస్టన్ చేజ్ చెరో 2; జోర్డాన్, ఓడియన్ స్మిత్, యన్నిక్ కరై తలా ఒక వికెట్ పడగొట్టారు.

జాన్సన్ ఛార్లెస్ కు ‘ప్లేయర్ అఫ్ ద మ్యాచ్’ దక్కింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular