నిర్మాణ రంగంలోకి యంగ్ టైగర్ నిజమేనా..?

ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ డైరెక్షన్ లో ‘దేవర’ అనే పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు. ఇటీవల రిలీజ్ చేసిన దేవర ఫస్ట్ లుక్ కు అనూహ్య స్పందన వచ్చింది. ఈ చిత్రాన్ని నందమూరి కళ్యాణ్ రామ్, మిక్కిలినేని సుధాకర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇటీవల రామెజీ ఫిలింసిటీలో ఎన్టీఆర్, సైఫ్ ఆలీఖాన్ పై యాక్షన్ సీన్స్ చిత్రీకరించారు. త్వరలో తాజా షెడ్యూల్ స్టార్ట్ చేయనున్నారు. వచ్చే ఏప్రిల్ 5న ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

ఇదిలా ఉంటే.. ఎన్టీఆర్ సొంతంగా నిర్మాణ సంస్థను ఏర్పాటు చేయబోతున్నారని ఓ వార్త బయటకు వచ్చింది. గతంలో కూడా ఇలాంటి వార్తే వస్తే… తనకు తన అన్న కళ్యాణ్ రామ్ స్టార్ట్ చేసిన ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ ఉందని.. అది తన సొంత నిర్మాణ సంస్థలాంటిదే అని.. అలాంటప్పుడు సొంతంగా మరో సంస్థ స్టార్ట్ చేయాల్సిన అవసరం ఏముందన్నాడు. ఇప్పుడు మళ్లీ ఎన్టీఆర్ నిర్మాణ సంస్థను స్టార్ట్ చేయబోతున్నారని వార్త రావడం ఆసక్తిగా మారింది. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. కొత్త నిర్మాణ సంస్థ ద్వారా న్యూ టాలెంట్ ను ప్రొత్సహించాలి అనుకుంటున్నారని టాక్ వినిపిస్తుంది.

టాలీవుడ్ లో కొంతమంది హీరోలకు సొంత నిర్మాణ సంస్థలు ఉన్నాయి. ఇప్పుడు ఆ హీరోల లిస్ట్ లోకి ఎన్టీఆర్ కూడా చేరబోతున్నారని ప్రచారం జరుగుతుంది. అయితే.. ఇది వాస్తవమా..? కాదా..? అనేది తెలియాల్సివుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *