ఎటూ తేల్చుకోలేకపోతున్న నాగ్..?

నాగార్జున ది ఘోస్ట్ సినిమా తర్వాత ఇప్పటి వరకు కొత్త సినిమా ప్రకటించలేదు. ఇదిగో అనౌన్స్ మెంట్.. అదిగో అనౌన్స్ మెంట్ అంటున్నారు కానీ.. ప్రకటన అయితే రావడం లేదు. రైటర్ బెజవాడ ప్రసన్నకుమార్ డైరెక్షన్ లో నాగార్జున కొత్త సినిమా అని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. ది ఘోస్ట్ మూవీ తర్వాత నాగ్ ఎందుకు ఇంత గ్యాప్ తీసుకున్నారు..? అసలు ఏమైంది..? అనేది ఆసక్తిగా మారింది. ఇంతకీ విషయం ఏంటంటే… రైటర్ ప్రసన్న చెప్పిన కథ మలయాళంలో విజయం సాధించిన సినిమాది. ఈ సినిమా రైట్స్ విషయంలో శ్రీనివాస్ చిట్టూరి, అభిషేక్ నామా మధ్య పోటీ ఏర్పడడం వలన కొంత ఆలస్యం అయ్యింది.

ఆతర్వాత రైటర్ ప్రసన్న కి డైరెక్షన్ ఛాన్స్ ఇవ్వాలి అనుకున్నారు కానీ.. ఇప్పుడు ప్రసన్న సరిగ్గా హ్యాండిల్ చేయగలడా..? అనే డౌట్ స్టార్ట్ అయ్యిందట. అందుకనే ఈ సినిమా విషయంలో ఏ నిర్ణయం తీసుకోలేకపోతున్నాడని.. తెలిసింది. ఈ నెల ఫస్ట్ వీక్ లో షూటింగ్ స్టార్ట్ చేసి జులై నుంచి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయాలి అనుకున్నారు కానీ.. ఎలాంటి అప్ డేట్ లేదు. అయితే.. తాజాగా అందిన సమాచారం ప్రకారం… ఈ నెలలో నాగార్జున ఈ సినిమా విషయంలో ఫైనల్ డిషిసన్ తీసుకోనున్నారని తెలిసింది.

బెజవాడ ప్రసన్నకుమార్ కే దర్శకత్వ బాధ్యలు అప్పగించే ఛాన్స్ ఉందని టాక్ వినిపిస్తుంది. ఈ సినిమాతో ఎలాగైనా బ్లాక్ బస్టర్ సాధించాలనే పట్టుదలతో ఉన్నారు నాగార్జున. ఈ సినిమాకు సంబంధించి వర్క్ అంతా కంప్లీట్ అయ్యింది. నాగ్ నిర్ణయం తీసుకోడం ఒక్కడే మిగిలివుందని తెలిసింది. అయితే.. ఈ చిత్రాన్ని శ్రీనివాస్ చిట్టూరి బ్యానర్ లో చేస్తారా..? లేక అభిషేక్ నామా బ్యానర్ లో చేస్తారా..? అనేది తెలియాల్సివుంది. మొత్తానికి  సస్పెన్స్ గా ఉన్న నాగ్ కొత్త సినిమా గురించి ఈ నెలలోనే క్లారిటీ రానుందనేది నిజం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *