మహేష్‌, త్రివిక్రమ్ ప్రాబ్లమ్ క్లియర్ అయ్యిందా..?

మహేష్‌ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్.. వీరిద్దరి కాంబినేషన్లో ‘గుంటూరు కారం’ అనే సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇటీవల రిలీజ్ చేసిన ఈ మూవీ టీజర్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. దీంతో గుంటూరు కారం సినిమా పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే.. ఈ సినిమా విషయంలో మహేష్‌, త్రివిక్రమ్ ఇద్దరికీ డిఫరెన్స్ వచ్చాయని వార్తలు వచ్చాయి. ఎందుకంటే.. ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ అయిన తర్వాత తను అనుకున్న విధంగా రాలేదని… తీసింది అంతా పక్కనపెట్టేశారట.

ఆతర్వాత షూటింగ్ చేశారు కానీ.. మహేష్ కు ఎక్కడో అసంతృప్తి ఉండడంతో ఇలా కాదని… తనకు అంతా ప్లాన్ ప్రకారం జరగాలని.. మొత్తం షూటింగ్ ప్లాన్ అంతా తనకు పేపర్ పై రాసి ఇవ్వాలని మహేష్ త్రివిక్రమ్ కు కండీషన్ పెట్టారట. ఆతర్వాత త్రివిక్రమ్ వర్కవుట్ చేసి పక్కా ప్లాన్ రెడీ చేశారని సమాచారం. మహేష్ అనుకున్నట్టుగా అంతా క్లియర్ గా ఉండడంతో వీరిద్దరి మధ్య వచ్చిన ప్రాబ్లమ్ క్లియర్ అయ్యిందని తెలిసింది. అందుకనే జూన్ 12 నుంచి షూటింగ్ స్టార్ట్ చేయడానికి మేకర్స్ ఏర్పాట్లు చేస్తున్నారు.

ఈసారి లెంగ్తీ షెడ్యూల్ ప్లాన్ చేశారని తెలిసింది. దీంతో ఆగష్టులో మహేష్‌ బర్త్ డేకి టీజర్ రిలీజ్ చేయడానికి కావాల్సినంత ఫుటేజ్ ఉంటుంది. ఈ చిత్రానికి ఎస్ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై రాధాకృష్ణ ఏమాత్రం రాజీపడకుండా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మహేష్ కు జంటగా పూజా హేగ్డే, శ్రీలీల నటిస్తున్నారు. గుంటూరు కారం టైటిల్ కు తగ్గట్టుగా టీజర్ ఉండడంతో అందరిలో క్యూరియాసిటీ పెరిగింది. సంక్రాంతికి ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *