సినిమాల పై, పెళ్లి పై క్లారిటీ ఇచ్చిన ప్రభాస్

ప్రభాస్ నటించిన భారీ చిత్రం ‘ఆదిపురుష్’. రామాయణం ఇతివృత్తంగా రూపొందిన మూవీ పై విమర్శలు వచ్చినప్పటికీ.. దానిని స్వీకరించి అద్భుతంగా తీర్చిదిద్దారు అనిపిస్తుంది. ట్రైలర్ చూసిన తర్వాత ఆదిపురుష్ ని విమర్శించడం మానేసి అభినందించడం స్టార్ట్ చేశారు. డైరెక్టర్ ఓంరౌత్ ఒక తపస్సులా ఈ సినిమాను తెరకెక్కించారు. తిరుపతిలో జరిగిన ప్రీ రిలీజ్ వేడుక ఈ సినిమా పై అంచనాలను అమాంతం పెంచేసింది. జూన్ 16న ఆదిపురుష్ మూవీ రిలీజ్ కానుంది. దీంతో ఆదిపురుష్ మరో బాహుబలి అవుతుందా అనేది ఆసక్తిగా మారింది.

ఈ ప్రీ రిలీజ్ వేడుకలో ప్రభాస్ మాట్లాడుతూ…. ఇక నుంచి సంవత్సరానికి రెండు సినిమాలు చేస్తాను. స్టేజ్ పై తక్కువ మాట్లాడతాను కానీ.. ఎక్కువ సినిమాలు చేస్తాను అని అభిమానులకు మాటిచ్చారు. సంవత్సరానికి కుదిరితే మూడు సినిమాలు రిలీజ్ చేస్తానని.. తన బలం అభిమానులే అని చెప్పారు. ఆదిపురుష్ ట్రైలర్ చూసి అభిమానుల ఇచ్చిన ధైర్యం మరచిపోలేనని… డైరెక్టర్ ఓంరౌత్ ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాడని.. 20 ఏళ్ల కెరీర్ లో అలాంటి వ్యక్తిని చూడలేదన్నారు. ఆదిపురుష్ టీమ్ అందర్నీ అభినందించారు.

ప్రభాస్ మాట్లాడుతున్నప్పుడు పెళ్లి గురించి చెప్పాలని అభిమానులు అడగగా.. ఇక్కడే తిరుపతిలో చేసుకుంటానని.. అది ఎప్పుడైనా జరగచ్చు అన్నారు. ఈ సంవత్సరం ఆదిపురుష్, సలార్ రిలీజ్ కానున్నాయి. వచ్చే సంవత్సరం ప్రాజెక్ట్ కే, మారుతితో చేస్తున్న మూవీ రిలీజ్ కానున్నాయి. సో.. ప్రభాస్ నుంచి సంవత్సరంలో రెండు సినిమాలు రావడం గ్యారెంటీ అని చెప్పచ్చు. ఇదే స్పీడు కంటిన్యూ చేస్తే.. ఈ జనరేషన్ హీరోల్లో ఎక్కువ సినిమాలు చేసే హీరోగా ప్రభాస్ నిలవడం ఖాయం అనిపిస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *