అమెరికాలో కాల్పులు కలకలం సృష్టించాయి. వర్జీనియాలోని రిచ్‌మండ్‌లో హైస్కూల్ గ్రాడ్యుయేషన్ వేడుక తర్వాత జరిగిన కాల్పుల్లో ఇద్దరు మృతి చెందగా, మరో 12 మంది గాయపడ్డారు. మంగళవారం సాయంత్రం హ్యూగెనాట్ హైస్కూల్‌లో గ్రాడ్యుయేషన్ కార్యక్రమం జరిగింది. అనంతరం స్కూలు సమీపంలో ఉన్న మన్రో పార్కులో దుండగులు కాల్పులకు పాల్పడ్డారని అధికారులు తెలిపారు. మరణించినవారిలో 18, 36 ఏండ్ల వయస్కులు ఉన్నట్లు వర్జీనియా సిటీ పోలీస్ చీఫ్ రిక్ ఎడ్వర్డ్స్ వెల్లడించారు.
Virginia: వర్జీనియాలో కాల్పులు…ఇద్దరు మృతి
హ్యూగెనాట్ హైస్కూల్ గ్రాడ్యుయేషన్ తర్వాత మన్రో పార్క్‌లో కాల్పులు జరిగినట్లు రిచ్‌మండ్ పబ్లిక్ స్కూల్స్ అధికారి మాథ్యూ స్టాన్లీ తెలిపారు. ఈ కాల్పుల ఘటనతో మరో పాఠశాల గ్రాడ్యుయేషన్ వేడుకను రద్దు చేశామని చెప్పారు. కాల్పులు జరిగిన మన్రో పార్క్ వద్ద పరిస్థితిని సమీక్షిస్తున్నామని నగర మేయర్ లెవర్ ఎం. స్టోనీ ట్విట్టర్ వేదిక ప్రకటించారు. ప్రజలెవరూ ఈ ప్రాంతానికి రావద్దని కోరారు.