Saturday, March 14, 2026
HomeTrending NewsE-Postal Ballot: త్వరలో ఈ-పోస్టల్‌ బ్యాలెట్‌

E-Postal Ballot: త్వరలో ఈ-పోస్టల్‌ బ్యాలెట్‌

విదేశాల్లో ఉంటున్న భారతీయులకు దేశంలో జరిగే ఎన్నికల్లో ఓటు వేసే అవకాశం కల్పించేందుకు ఈ-పోస్టల్‌ బ్యాలెట్‌ వంటి సాంకేతిక అధారిత పద్ధతులను వినియోగించుకొనే సమయం ఆసన్నమైందని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి రాజీవ్‌ కుమార్‌ పేర్కొన్నారు. శుక్రవారం 2022 బ్యాచ్‌ ఐఎఫ్‌ఎస్‌ ట్రైనీ అధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

ఇప్పటికే ఈ పద్ధతి అమలుపై ఈసీ, విదేశాంగ మంత్రిత్వ శాఖ మధ్య చర్చలు జరుగుతున్నాయని కేంద్రం మార్చిలో రాజ్యసభలో పేర్కొన్నది. ఏడాది వ్యవధిలో జరగనున్న లోక్‌సభ, ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం సిద్ధమవుతున్నది.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular