Wednesday, June 17, 2026
Homeసినిమావరుణ్‌, లావణ్య పెళ్లి ఎక్కడ..? ఎప్పుడు..?

వరుణ్‌, లావణ్య పెళ్లి ఎక్కడ..? ఎప్పుడు..?

హీరో వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠి ప్రేమలో ఉన్నారు, పెళ్లి కూడా చేసుకోబోతున్నారంటే ఇదేదో గ్యాసిప్ అనుకున్నారు కానీ.. ఇద్దరికీ ఎంగేజ్ మెంట్ కూడా పూర్తయింది. ఇప్పుడు పెళ్లి ఎక్కడ..? ఎప్పుడు..? అనేది ఆసక్తిగా మారింది. సాధారణంగా సెలబ్రిటీలు డెస్టినేషన్ మ్యారేజ్ లే చేసుకుంటున్నారు. లేటెస్ట్ గా యంగ్ హీరో శర్వానంద్ పెళ్లి జైపూర్ లో జరిగింది. వరుణ్ తేజ్, లావణ్యలు కూడా ఓ మాంచి డెస్టినేషన్ స్పాట్ లో పెళ్లి చేసుకుంటారని వార్తలు వస్తున్నాయి. అయితే.. దీని కోసం పెద్ద లిస్టే తయారు చేసుకున్నారట కానీ.. ఫస్ట్ ప్రిఫరెన్స్ మాత్రం ఇటలీ అని తెలిసింది.

ఇటలీలోనే ఎందుకు పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నారంటే… వరుణ్, లావణ్యల మధ్య స్నేహం ఏర్పడింది ఇటలీలోనే అట. మిస్టర్ షూటింగ్ కి ఇటలీ వెళ్లినప్పుడు స్నేహం ఏర్పడి అది ప్రేమగా మారిందట.  అందుకే ఇటలీలో మ్యారేజ్ చేసుకోవాలి అనుకుంటున్నారని సమాచారం. ఇంతకీ.. పెళ్లి ఎప్పుడు అంటే.. ఈ సంవత్సరంలోనే ఉంటుందని టాక్ వినిపిస్తుంది. మొత్తానికి వరుణ్, లావణ్య ఎవరికీ తెలియకుండా ఇన్నాళ్లు ఇంత స్టోరీ నడిపారా అని కామన్ ఆడియన్స్ మాత్రమే కాదు.. మెగా ఫ్యాన్స్ కూడా సర్ ఫ్రైజ్ గా ఫీలవుతుండడం విశేషం.

ఫామ్ హౌస్ లో జరిగిన ఈ నిశ్చితార్థ  కార్యక్రమానికి మెగా హీరోలు అందరూ హాజరయ్యారు. ఈ వేడుక ఫోటోలు ఇప్పుడు  సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యాయి.  కొత్త జంటకు శుభాకాంక్షలు తెలియచేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular