Saturday, July 27, 2024
HomeTrending NewsAmarnath Yatra: జూలై ఒకటి నుంచి అమర్ నాథ్ యాత్ర

Amarnath Yatra: జూలై ఒకటి నుంచి అమర్ నాథ్ యాత్ర

పవిత్ర అమర్‌నాథ్‌ యాత్ర జూలై 1న ప్రారంభమై ఆగస్టు 31 వరకు కొనసాగనుంది. దక్షిణ కశ్మీర్‌లోని హిమాలయ పర్వతాల్లో 3,880 మీటర్ల ఎత్తున కొలువుదీరే మంచు శివలింగాన్ని దర్శించుకునేందుకు భారీ ఎత్తున భక్తులు రానున్నారు. గత ఏడాది 3.45 లక్షల మంది అమర్‌నాథ్‌ యాత్రలో పాల్గొనగా ఈసారి 5 లక్షల మంది పాల్గొనే అవకాశం ఉన్నట్టు అంచనా వేస్తున్నారు. గత ఏడాది ఆకస్మిక వరదల కారణంగా 16 మంది భక్తులు ప్రాణాలు కోల్పోయిన ఘటనను దృష్టిలో ఉంచుకొని ఈసారి మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

అమర్‌నాథ్‌కు వెళ్లే బట్కల్‌, పహల్‌గామ్‌ దారుల్లో భారీగా మంచు పేరుకొని ఉండటంతో జూన్‌ 15 నాటికి మంచును తొలగించే పనిని బార్డర్‌ రోడ్స్‌ ఆర్గనైజేషన్‌ చేపట్టింది. మరోవైపు యాత్రను ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకునే ముప్పు ఉందనే ఇంటెలిజెన్స్‌ హెచ్చరికల నేపథ్యంలో మరింత కట్టుదిట్టమైన భద్రత కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు శుక్రవారం యాత్ర భద్రతా ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష జరిగింది. ఆరోగ్యకరమైన ఆహారాన్నే అనుమతించాలని అమర్‌నాథ్‌  ఆలయ బోర్డు నిర్ణయించింది.

 

RELATED ARTICLES

Most Popular

న్యూస్