బిసిలకు చేసిన మంచి ప్రచారం చేయండి: విజయసాయి

నాలుగేళ్ల కాలంలో జగన్ ప్రభుత్వం బీసీలకు చేకూర్చిన ప్రయోజనాల గురించి తెలియజెప్పాలని పార్టీ అనుబంధ సంఘాల ఇన్ ఛార్జ్ వి. విజయసాయి రెడ్డి బిసీ సెల్ నేతలకు సూచించారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యలయంలో ఈరోజు పార్టీ బిసీ, వాణిజ్య విభాగాల అధ్యక్షులు, జోనల్ ఇంచార్జీలు, జిల్లా అధ్యక్షులతో విజయసాయి విడివిడిగా సమావేశాలు నిర్వహించారు. సిఎం జగన్ అన్ని పదవుల్లో బీసీలకు అగ్రప్రాధాన్యం ఇస్తున్నారని, బీసీ సంఘాలు ఎప్పటి నుంచో డిమాండ్‌ చేస్తున్న బీసీ కులగణనను చేపట్టాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించిందని ఆయన గుర్తు చేశారు. దేశవ్యాప్తంగా జరగబోయే జనాభా లెక్కల సేకరణలో భాగంగా బీసీల కులగణన కూడా చేపట్టాలని కేంద్రాన్ని కోరుతూ ఏ.పీ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు.

మంత్రివర్గంలో, కార్పొరేషన్ పదవుల్లో, బిసిలకు ప్రత్యేకంగా 56 కార్పొరేషన్లు ఏర్పాటు, స్థానిక సంస్థల పదవుల్లో బిసిలకు ప్రాధాన్యం లాంటి అంశాలపై ప్రజలకు సమగ్రంగా ప్రచారం చేయాలని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *