Tuesday, June 16, 2026
Homeసినిమా'ఆదిపురుష్' నుంచి 'శివోహం' సాంగ్ రిలీజ్!

‘ఆదిపురుష్’ నుంచి ‘శివోహం’ సాంగ్ రిలీజ్!

ప్రభాస్, ఓంరౌత్ కాంబోలో తెరకెక్కిన భారీ చిత్రం ‘ఆదిపురుష్‌’. రామాయణం ఆధారంగా రూపొందిన మూవీ పై అటు అభిమానుల్లోనూ, ఇటు ఇండస్ట్రీలోనూ భారీ అంచనాలు ఉన్నాయి. ట్రైలర్ అండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ తర్వాత ప్రేక్షకుల్లో ఆదిపురుష్ మూవీ పై మరింత ఆసక్తి ఏర్పడింది. జూన్ 16న ఆదిపురుష్ మూవీని ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేశారు.

శ్రీరాముడిగా ప్రభాస్ .. సీతాదేవిగా కృతి సనన్ నటించిన ఈ సినిమాలో, లక్ష్మణుడిగా సన్నీ సింగ్ .. హనుమంతుడుగా దేవ్ దత్ నటించారు. ఇటీవలే తెలుగు వెర్షన్ కి సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంటును గ్రాండ్ గా నిర్వహించారు. అప్పటి నుంచి అంచనాలు పెంచుతూ వెళుతూ ఉన్న ఈ సినిమా నుంచి, కొంతసేపటి క్రితం ‘శివోహం’ అనే పాటను రిలీజ్ చేశారు.మహా ఫాల నేత్ర ..  అంటూ ఈ పాట సాగుతోంది. కథాపరంగా శివుడిని పూజిస్తూ రావణాసురుడు ఆలపించే పాట ఇది. తెలుగులో రామజోగయ్య శాస్త్రి సాహిత్యాన్ని అందించగా .. హరిచరణ్  ఆలపించాడు. అజయ్ – అతుల్ స్వరపరిచిన ఈ పాట వెంటనే కనెక్ట్ అవుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular