మోక్షజ్ఞ ఎంట్రీకి ముహూర్తం ఎప్పుడు?

నందమూరి బాలకృష్ణ నటవారసుడు మోక్షజ్ఞ ఎంట్రీ ఎప్పుడనేది కొంతకాలంగా సమాధానం లేని ప్రశ్నగా మిగిలింది. బాలయ్యను ఎప్పుడు అడిగినా.. టైమ్ వచ్చినప్పుడు చెబుతాననేవారు. సీనియర్ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు డైరెక్షన్ లో ఆదిత్య 369 సీక్వెల్ ఆదిత్య 999 లో మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందని టాక్ వినిపించింది. ఆ తర్వాత ఈ సినిమాను సింగీతం కాదు.. బాలయ్యే డైరెక్షన్ చేయనున్నారని వార్తలు వచ్చాయి. ఇప్పటివరకు ఎలాంటి అప్ డేట్ లేదు. దీంతో అసలు ప్రాజెక్ట్ ఉందా లేదా అనేది సస్పెన్స్ గా మారింది.

అయితే.. మోక్షజ్ఞ లుక్ బయటకు రావడం… బాగా లావుగా ఉండడంతో ఆయనకు సినిమాల్లో నటించాలనే ఇంట్రస్ట్ లేదని.. అందుకనే అలా లావుగా కనిపిస్తున్నాడని వార్తలు వచ్చాయి. దీంతో అభిమానులు కూడా మోక్షజ్ఞ గురించి పట్టించుకోవడం మానేశారు. అయితే.. ఇప్పుడు మోక్షజ్ఞ చాలా స్లిమ్ గా ఉన్న లుక్ బయటకు వచ్చింది. ఈ లుక్ చూసిన తర్వాత హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు రంగం సిద్ధం అవుతంది అనిపిస్తుంది. ఇప్పుడు బాలయ్య తన కుమారుడు తొలి చిత్రానికి దర్శకత్వం వహించే బాధ్యతను ఎవరికి అప్పగించారనేది ఆసక్తిగా మారింది.

బోయపాటి, పూరి జగన్నాథ్, క్రిష్.. ఇలా కొంత మంది పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. తాజాగా అనిల్ రావిపూడి పేరు కూడా వినిపిస్తుంది. తొలి చిత్రాన్ని మాస్ మూవీలా కాకుండా లవ్ స్టోరీ చేయాలని డిసైడ్ అయ్యారట. ఆమధ్య బాలయ్య.. మోక్షజ్ఞ కోసం కథలు విన్నారని కూడా ప్రచారం జరిగింది. అయితే.. ఎప్పుడు సినిమా ఉంటుంది అనేది తెలియలేదు కానీ వచ్చే సంవత్సరం మాత్రం మోక్షజ్ఞ ఎంట్రీ ఖాయమని వినిపిస్తుంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే… వచ్చే సంవత్సరం మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటే నందమూరి అభిమానులకు పండగే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *