Tuesday, June 16, 2026
HomeTrending Newsబాలయ్య 'భగవంత్ కేసరి' టీజర్ రిలీజ్!

బాలయ్య ‘భగవంత్ కేసరి’ టీజర్ రిలీజ్!

బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న భారీ చిత్రం ‘భగవంత్ కేసరి’. అఖండ, వీరసింహారెడ్డి చిత్రాలతో వరుసగా బ్లాక్ బస్టర్స్ సాధించిన తర్వాత వస్తున్న సినిమా కావడంతో సినిమా పై అటు అభిమానుల్లోనూ, ఇటు ఇండస్ట్రీలనూ భారీ అంచనాలు ఉన్నాయి. ఇటీవల రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ కు అనూహ్య స్పందన వచ్చింది. దీంతో సినిమా పై మరింత క్రేజ్ పెరిగింది.

ఈ రోజున బాలకృష్ణ పుట్టినరోజు కావడంతో, ఈ సినిమా నుంచి ఫస్టు టీజర్ ను రిలీజ్ చేశారు. ‘అడవి బిడ్డా .. నేలకొండ భగవంత్ కేసరి’ అంటూ తన గురించి తాను చెప్పుకుంటూ బాలకృష్ణ యాక్షన్ లోకి దిగిపోవడం ఈ టీజర్ లో కనిపిస్తోంది. ఈ పేరు చానా ఏళ్లు యాదుంటది అనే  బాలయ్య డైలాగ్ తో ముగించారు. తెలంగాణ యాసలో బాలయ్య అదరగొట్టనున్నట్టు ఈ టీజర్ చూస్తే అర్థమవుతోంది.

బాలకృష్ణ సరసన నాయికగా కాజల్ కనిపించనుంది. ఇక ఆయన కూతురి పాత్రలో శ్రీలీల నటిస్తోంది. కథ అంతా కూడా తండ్రీ కూతుళ్ల అనుబంధం నేపథ్యంలో కొనసాగనుంది. తన పాత్రకి గల ప్రాధాన్యత కారణంగానే, శ్రీలీల అంగీకరించినట్టుగా చెబుతున్నారు. తమన్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాను దసరా కి విడుదల చేయనున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular