Wednesday, June 17, 2026
Homeసినిమా'ఉస్తాద్ భగత్ సింగ్' కి బ్రేక్ పడినట్టేనా!

‘ఉస్తాద్ భగత్ సింగ్’ కి బ్రేక్ పడినట్టేనా!

పవన్ కళ్యాణ్.. వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. హరి హర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్, ఓజీ, బ్రో.. ఇలా ఒకేసారి నాలుగు సినిమాలను సెట్స్ పైకి తీసుకువచ్చారు. కెరీర్ లోనే ఇలా ఓకేసారి నాలుగు సినిమాలు చేయడం ఇదే ఫస్ట్ టైమ్ కావడం విశేషం. ఇటీవల బ్రో సినిమా షూటింగ్ కంప్లీట్ చేశారు. ఇప్పుడు  ఓజీ మూవీ షూటింగ్ లో జాయిన్ అయ్యారు. పవన్ కళ్యాణ్ పై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. సాహో డైరెక్టర్ సుజిత్ తెరకెక్కిస్తున్న ఓజీ చిత్రాన్ని అక్టోబర్ కి పూర్తి చేసి డిసెంబర్ లో విడుదల చేయాలనేది ప్లాన్.

అయితే.. ఉస్తాద్ భగత్ సింగ్ తాజా షెడ్యూల్ త్వరలో స్టార్ట్ చేయనున్నట్టుగా ఇటీవల ప్రకటించారు కానీ.. ఈ నెల 14 నుంచి పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర స్టార్ట్ చేయనున్నారు. ఈ యాత్రతో పవన్ పొలిటికల్ గా బిజీ కానున్నారు. దీంతో ఈ సినిమా  తాజా షెడ్యూల్ ఎప్పుడనేది సస్పెన్స్ లో పడింది. హరీష్ శంకర్ ఈ మూవీని చాలా ఫాస్ట్ గా కంప్లీట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇటీవల రిలీజ్ చేసిన టీజర్ కు ట్రెమండస్ రెస్పాన్స్ రావడంతో మరింత కసితో.. మరింత ఉత్సాహంతో ఈ సినిమాకి వర్క్ చేస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో రూపొందుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ తాజా షెడ్యూల్ పై క్లారిటీ రావాల్సివుంది.

ఉస్తాద్ భగత్ సింగ్ పరిస్థితే ఇలా ఉంటే.. వీరమల్లు పరిస్థితి… ఏంటి..? ఇది ఎప్పుడో స్టార్ట్ అయ్యింది. ఇంకా షూటింగ్ స్టేజ్ లోనే ఉంది. ఈ సినిమా వెనకాల స్టార్ట్ చేసిన భీమ్లా నాయక్ రిలీజైంది. ఇప్పుడు బ్రో రిలీజ్ కి రెడీ అవుతుంది. ఓజీ కూడా డిసెంబర్ లో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. వీరమల్లు మాత్రం ఎప్పుడు పూర్తవుతుందో..? ఎప్పుడు రిలీజ్ కానుందో ఎవరికీ తెలియని పరిస్థితి. పాపం..  వీరమల్లు దర్శకుడు క్రిష్‌, నిర్మాత ఏ.ఎం.రత్నం ఏం చేయాలో తెలియక.. తమ బాధ ఎవరికీ చెప్పుకోవాలో తెలియక బాధపడుతున్నారట. మరి.. వీరమల్లుకు మోక్షం ఎప్పుడో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular