Wednesday, June 17, 2026
Homeసినిమా'భగవంత్ కేసరి' టైటిల్ ప్లాన్ వర్కవుట్ అవుతుందా..?

‘భగవంత్ కేసరి’ టైటిల్ ప్లాన్ వర్కవుట్ అవుతుందా..?

బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న భారీ చిత్రం ‘భగవంత్ కేసరి’. ఈ భారీ చిత్రంలో బాలయ్యకు జంటగా కాజల్ అగర్వాల్ నటిస్తే… కూతురుగా క్రేజీ హీరోయిన్ శ్రీలీల నటిస్తుండడం విశేషం. అఖండ, వీరసింహారెడ్డి చిత్రాలతో వరుసగా బ్లాక్ బస్టర్స్ సాధించిన తర్వాత వస్తున్న సినిమా కావడంతో భగవంత్ కేసరి సినిమా పై అటు అభిమానుల్లోనూ, ఇటు ఇండస్ట్రీలనూ భారీ అంచనాలు ఉన్నాయి. ఇటీవల రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ కు అనూహ్య స్పందన వచ్చింది. దీంతో సినిమా పై మరింత క్రేజ్ పెరిగింది.

అయితే.. భగవంత్ కేసరి అనే టైటిల్ పెట్టడం వెనకు పెద్ద ప్లానే ఉందట. మేటర్ ఏంటంటే.. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేయాలి అనుకుంటున్నారట. అందుకనే ఏ టైటిల్ పెడితే బాగుంటుందా అని బాగా ఆలోచించి ఈ టైటిల్ ఫిక్స్ చేశారట. భగవంత్ కేసరి అంటే నార్త్ ఆడియన్స్ కి కూడా కనెక్ట్ అవుతుందనే ఉద్దేశ్యంతోనే ఈ టైటిల్ ఖరారు చేశారట. ముందు నుంచి పాన్ ఇండియా ప్లాన్ ఉంది కాబట్టే.. ఈ సినిమాలో విలన్ పాత్ర కోసం బాలీవుడ్ యాక్టర్ అర్జున్ రాంపాల్ ను తీసుకున్నారు.

ఇప్పటి వరకు బాలయ్యను ఎవరూ చూపించని విధంగా ఇందులో చూపిస్తున్నాను అని అనిల్ రావిపూడి చెప్పడంతో అభిమానుల్లో మరిన్ని అంచనాలు పెరిగాయి. దీనికి తోడు ఇది పాన్ ఇండియా మూవీ అని వార్తలు వస్తుండడంతో ఈసారి బాలయ్య పాన్ ఇండియా రేంజ్ లో ఏ రేంజ్ సక్సెస్ సాధించనున్నారు అనేది ఆసక్తిగా మారింది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఆగష్టుకి షూటింగ్ పూర్తవుతుంది. దసరాకి ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో విడుదల చేయనున్నారు. మరి.. పాన్ ఇండియా ప్లాన్ వర్కవుట్ అవుతుందా..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular