Saturday, September 21, 2024
Homeసినిమా'దేవర' కోసం ఎన్టీఆర్ రిస్క్ చేస్తున్నాడా..?

‘దేవర’ కోసం ఎన్టీఆర్ రిస్క్ చేస్తున్నాడా..?

ఎన్టీఆర్ ప్రస్తుతం ‘దేవర’ సినిమా చేస్తున్నారు. ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. జనతా గ్యారేజ్ తర్వాత వీరిద్దరూ కలిసి సినిమా చేయాలి అనుకున్నారు. అది ఇప్పటికి సెట్ అయ్యింది. ఇందులో ఎన్టీఆర్ కు జంటగా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటిస్తుంటే… విలన్ పాత్రకు బాలీవుడ్ విలన్ సైఫ్ ఆలీఖాన్ నటిస్తుండడం విశేషం. ఆమధ్య రిలీజ్ చేసిన దేవర ఫస్ట్ లుక్ కు అనూహ్య స్పందన వచ్చింది. దీంతో దేవర పై మరింతగా అంచనాలు పెరిగాయి. అలాగే దేవర లుక్ చూసినప్పటి నుంచి అసలు కథ ఏంటి..? అనేది ఆసక్తిగా మారింది.

సముద్రం బ్యాక్ డ్రాప్ లో ఇప్పటి వరకు ఎవరూ చెప్పని కథ ఏదో చెబుతున్నాడని మాత్రం అర్థం అవుతుంది. అయితే.. దేవర కోసం ఎన్టీఆర్ రిస్క్ చేస్తున్నాడని వార్తలు వస్తున్నాయి. ఏంటా రిస్క్ అంటే… దేవర తాజా షెడ్యూల్ ను రామోజీ ఫిలింసిటీలో స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇందులో సముద్రపు వాటర్ ను పోలి ఉండే ఓ భారీ ట్యాంక్ నిర్మాణ పనులు జరుగుతున్నట్లు తెలిసింది. ఎన్టీఆర్,  సైఫ్ అలీ ఖాన్ మధ్య ఓ యాక్షన్ సీక్వెన్స్ ను షూట్ చేయబోతున్నట్లుగా సమాచారం. ఈ అండర్ వాటర్ ఫైట్ కోసం ఎన్టీఆర్ డూప్ లేకుండా రిస్క్ చేయబోతున్నారని టాక్ వినిపిస్తుంది.

నేచురాలిటీ మిస్ కాకుడదని.. ఆడియన్స్ థ్రిల్ కలిగించాలని.. అందుకనే ఎన్టీఆర్ డూప్ లేకుండా చేయాలని నిర్ణయం తీసుకున్నాడని అంటున్నారు. ఈ అండర్ వాటర్ ఫైట్ సినిమాకే హైలెట్ కానుందని.. వారం రోజులు పాటు ఈ ఫైట్ సీన్ చిత్రీకరించనున్నారని తెలిసింది.  ఈ భారీ పాన్ ఇండియా మూవీకి సంగీత సంచలనం అనిరుథ్ మ్యూజిక్ అందించనున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. వచ్చే సంవత్సరం ఏప్రిల్ 5న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్