విలాసవంతమైన జీవితం, ప్రతిభ ఉన్నవారికి పట్టం కట్టే అమెరికాలో కాలు పెట్టేందుకు ప్రపంచ వ్యాప్తంగా దాదాపు అన్ని దేశాల ప్రజలు ఆసక్తి చూపుతారు. ముఖ్యంగా ఆసియా, దక్షిణ అమెరికా దేశాల నుంచి ఉన్నత చదువులు, ఉద్యోగాల కోసం వెళ్ళే వారి సంఖ్యా రోజు రోజుకు పెరుగుతోంది. ఈ నేపథ్యంలో అమెరికా జనాభాపై కొత్త విషయాలు బయటకు వచ్చాయి.
వలసలు లేకపోతే అమెరికాలో నిరుడు జనాభా తగ్గిపోయి ఉండేదని అమెరికా జన గణన సంస్థ గురువారం విడుదల చేసిన గణాంకాలు వెల్లడించాయి. వలసల కారణంగా అమెరికాలో ఆసియన్ల సంఖ్య పెరిగిందని, 2022 నాటికి అమెరికా జనాభా 33.32 కోట్లకు చేరుకుందని నివేదికలో పేర్కొన్నారు. అంతకు ముందు సంవత్సరంతో పోలిస్తే ఇది 0.4 శాతం ఎక్కువని ఆ సంస్థ తెలిపింది. ఇతర దేశాల నుంచి శ్వేత జాతీయుల రాక కూడా భారీగా పెరిగిందని వివరించింది.
Post Views: 63