ఉత్తరప్రదేశ్ లో సంఘ వ్యతిరేక శక్తుల ఏరివేత వేగంగా జరుగుతోంది. శాంతి భద్రతల పరిరక్షణకు పెద్ద పీట వేస్తున్న యోగి అదిత్యనాత్ ప్రభుత్వం నేరస్తులను ఏ మాత్రం ఉపెక్షించటం లేదు. ఇదే కోవలో ఈ రోజు ఉదయం ఎన్‌కౌంటర్ జరిగింది. మోస్ట్ వాంటెడ్ క్రిమినల్‌ను పోలీసులు హతమార్చారు. కౌషాంబి జిల్లాలో ఆ ఎన్‌కౌంటర్ జరిగింది. నిందితుడిని గుర్ఫాన్‌గా గుర్తించారు. మర్డర్, చోరీ లాంటి అనేక కేసులు అతనిపై ఉన్నాయి. కౌషాంబి జిల్లాలో ఇవాళ ఉదయం 5 గంటలకు కూంబింగ్ నిర్వహిస్తున్న సమయంలో గుర్ఫాన్ పోలీసులకు ఎదురుపడ్డాడు.
క్రాస్ ఫైరింగ్‌లో అతను గాయపడ్డాడు. గాయాలతో ఆస్పత్రికి తీసుకువెళ్లగా, అప్పటికే అతను మరణించినట్లు డాక్టర్లు తేల్చారు. ప్రతాప్‌ఘడ్‌తో పాటు ఇతర జిల్లాల్లో గుర్ఫాన్‌పై మొత్తం 13 కేసులు ఉన్నాయి. అతన్ని పట్టి ఇస్తే లక్ష ఇస్తామని గతంలో యూపీ పోలీసులు రివార్డు కూడా ప్రకటించారు. యూపీ సీఎంగా యోగి అదిత్యనాత్ బాధ్యతలు చేపట్టిన తర్వాత అక్కడ 185 మంది క్రిమినల్స్‌ను హతమార్చారు.