కరోనా కేసుల తీవ్రత కారణంగా కేరళలో ఈ నెల 8 నుంచి 16 వరకూ సంపూర్ణ లాక్ డౌన్ అమలు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రకటించారు. రాష్ట్రంలో నిన్న ఒక్కరోజే 41,953 కేసులు నమూదయ్యాయి. పరిస్థితి అదుపు తప్పే ప్రమాదం ఉండడంతో సంపూర్ణ లాక్ డౌన్ పై విజయన్ నిర్ణయం తీసుకున్నారు.
గత ఏడాది కోవిడ్ తొలిదశలో కూడా మనదేశంలో కేరళ రాష్ట్రంలోనే తొలుత ఎక్కువ కేసులు నమోదయ్యాయి. వెంటనే పెద్ద ఎత్తున నివారణ చర్యలు తీసుకుని కోవిడ్ ను నియంత్రించడంలో కేరళ ప్రభుత్వం సఫలమైంది. కోవిడ్ సమయంలో విజయన్ ప్రభుత్వం తీసుకున్న అనేక చర్యలు ప్రజల మనన్నలు కూడా పొందాయి. అందుకే ఇటివల వెల్లడైన కేరళ అసెంబ్లీ ఎన్నికలో విజయన్ మరోసారి అధికారాన్ని నిలబెట్టుకున్నారు.