Saturday, November 23, 2024
HomeTrending NewsDutch Coast: నౌకలో అగ్నిప్రమాదం...మూడు వేల కార్లు ఆహుతి

Dutch Coast: నౌకలో అగ్నిప్రమాదం…మూడు వేల కార్లు ఆహుతి

జర్మనీ నుంచి దాదాపు 3 వేల కార్లతో వెళ్తున్న ఓ కార్గో షిప్ నెదర్లండ్స్ దేశం సమీపంలో నడి సంద్రంలో అగ్నిప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఒకరు ప్రాణాలు కోల్పోగా.. పలువురు గాయపడ్డారు. డచ్ కోస్ట్ గార్డ్ తెలిపిన వివరాల ప్రకారం..

జర్మనీ నుంచి ఈజిప్ట్ కు వెళుతున్న పనమియన్ భారీ షిప్ మంగళవారం రాత్రి డచ్ తీరంలోకి రాగానే మంటల్లో చిక్కుకుంది. షిప్ లో పెద్ద మొత్తంలో విలావంతమైన కార్లతో పాటు, అందులో 14 ఎలక్ట్రిక్ కార్లు కుడా ఉన్నాయి. ఎలక్ట్రిక్ కార్లల్లో ఒకదానికి నిప్పంటుకోవడంతోనే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని అనుమానిస్తున్నారు. మంటలు భారీగా చెలరేగడంతో షిప్ లోని ఒకరు ప్రాణాలు కోల్పోయారు. మరో 23 మంది సిబ్బంది సముద్రంలోకి దూకి ప్రాణాలు కాపాడుకున్నారు. వారందరినీ ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా రక్షించి ఆసుపత్రికి తరలించారు. వారంతా ఒళ్లు కాలి, ఎముకలు విరిగి, శ్వాస తీసుకోలేక ఇబ్బందిపడుతున్నట్లు డచ్ అధికారులు తెలిపారు.
మరోవైపు రంగంలోకి దిగిన రెస్క్యూ బృందాలు కార్గోలో చెలరేగిన మంటలను అదుపుచేసేందుకు యత్నిస్తున్నాయి. అయితే, మంటలు ఆర్పేందుకు ఎక్కువ నీటిని ఓడపైకి స్ప్రే చేస్తే నౌక మునిగిపోయే ప్రమాదం ఉందని డచ్ కోస్ట్ గార్డ్ తెలిపింది. దీంతో నౌక పక్క భాగంలో మాత్రమే నీటిని స్ప్రే చేస్తున్నట్లు వివరించింది. ఈ ప్రమాదంలో కార్లన్నీ పూర్తిగా బుగ్గిపాలైనట్లు తెలుస్తోంది. కార్గోలో చెలరేగిన మంటలు రోజుల తరబడి కొనసాగే అవాకశం ఉందని అధికారులు చెబుతున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్