Saturday, November 23, 2024
Homeసినిమాపవర్ స్టార్ కౌంటర్ కి నాజర్ అన్సర్ ఇదే

పవర్ స్టార్ కౌంటర్ కి నాజర్ అన్సర్ ఇదే

తమిళ ఇండస్ట్రీలో కొత్త నిబంధనలు ప్రవేశపెట్టారని ఓ వార్త ప్రచారంలోకి వచ్చింది. తమిళ సినిమాల్లో తమిళ నటీనటులు మాత్రమే నటించాలని.. అలాగే తమిళ టెక్నీషియన్స్ మాత్రమే వర్క్ చేయాలనే రూల్ పెట్టుకున్నారని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. విదేశాల్లో షూటింగ్ లకు దూరంగా ఉండాలని ఫెఫ్సీ అధ్య‌క్షుడు, త‌మిళ నిర్మాత ఆర్కే సెల్వమణి కొత్త నిబంధ‌న‌లు పెట్ట‌డం పై ఇటీవ‌ల తెలుగు సినిమా ‘బ్రో’ ఈవెంట్లో పవన్ కళ్యాణ్ తీవ్రంగా విమ‌ర్శించారు. క‌ళాకారుల‌కు హ‌ద్దులు నియ‌మించ‌కూడ‌ద‌ని అన్ని ప‌రిశ్ర‌మ‌ల్లో ఆర్టిస్టుల కు అవ‌కాశాలు క‌ల్పించాల‌ని అన్నారు.

అలా చేయ‌క‌పోతే టాలీవుడ్ నుంచి ఆర్ఆర్ఆర్, బాహుబ‌లి లాంటి చిత్రాలు వ‌చ్చేవి కావని కూడా అన్నారు. అయితే.. ఈ వ్యాఖ్య‌ల‌ను తమిళనాడు నడిగర సంఘం అధ్యక్షుడిగా ఉన్న తమిళ నటుడు నాజర్ ఖండించారు. FEFSI చర్యలు తప్పుగా అన్వ‌యించ‌బడ్డాయని నాజ‌ర్ ఈ సంద‌ర్భంగా పేర్కొన్నారు. దేశ వ్యాప్తంగా ప్రతిభావంతులతో కూడిన తమిళ చిత్ర పరిశ్రమలో ఇటువంటి నిబంధనలు ఆచరణీయం కాదని ఆయన అన్నారు. తమిళ ఇండస్ట్రీలో ఇతర భాషల నటీనటులను ఎంటర్‌టైన్ చేయరని మీడియాలో తప్పుడు వార్తలు వస్తున్నాయని ఇదంతా త‌ప్పుడు స‌మాచారం అని నాజ‌ర్ అన్నారు.

తమిళ చిత్ర పరిశ్రమలో ఇలాంటి తీర్మానం చేస్తే.. దానికి వ్యతిరేకంగా గళం వినిపించే మొదటి వ్యక్తి నేనేనని.. ఇప్పుడు మనం పాన్-ఇండియన్ సినిమాల యుగంలో ఉన్నామని నాజ‌ర్ అన్నారు. తమిళ చిత్ర పరిశ్రమల కార్మికులను రక్షించేందుకు, తమిళ సినిమాల్లో తమిళ కార్మికులకు అవ‌కాశాలు క‌ల్పించాల‌ని సెల్వమణి కొన్ని తీవ్రమైన నిర్ణయాలు తీసుకున్నారు. వాణిశ్రీ, శార‌ద వంటి ప్ర‌ముఖ తార‌ల‌ను త‌మిళ ప‌రిశ్ర‌మ‌లో అక్కున చేర్చుకున్నాం. మనకు చాలా కాలంగా మంచి సంప్రదాయం ఉంది. కాబట్టి నా ప్రియమైన సోదర‌ సోద‌రీమ‌ణులారా ఈ సమాచారాన్ని సీరియస్‌గా తీసుకోకండి. మేం కలిసి సినిమాలు తీస్తాం. వాటిని ప్రపంచ వ్యాప్తంగా తీసుకెళతాము అన్నారాయన. మరి..  ఈ వివాదం పై ఎఫ్‌ఈఎఫ్‌ఎస్‌ఐ అధ్యక్షుడు ఆర్కే సెల్వమణి ఎలా స్పందిస్తారో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్