కేరళలో వ్యాక్సినేషన్ వేగవంతం చేయలాని కేంద్ర బృందం రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. కేరళలో క్షేత్ర స్థాయిలో మహమ్మారి విస్తరణ పరిశీలించటానికి వచ్చిన కేంద్ర బృందం ఆరో జిల్లాల్లో పర్యటించింది. రాజధాని తిరువనంతపురం తో సహా కొన్ని జిల్లాల్లో ఆర్ వాల్యు 1.2 గా ఉన్నట్టు సమాచారం. ఇంటింటి సర్వే చేపట్టి, కంటైన్మేంట్ జోన్ లు కట్టు దిట్టం చేయాలని ఆరుగురు సభ్యులతో కూడిన కేంద్ర బృందం సిఫారసు చేసింది.
కేరళలోని గ్రామీణ ప్రాంతాల్లో మహమ్మారి విస్తరణ వేగంగా జరుగుతోందని కేంద్ర బృందం పరిశీలనలో వెల్లడైంది. మరోవైపు టీకా పంపిణీ వేగవంతం చేయాలని కేరళ మెడికల్ ఆఫీసర్స్ అసోసియేషన్ ప్రభుత్వాన్ని కోరింది. ముఖ్యమంత్రి పినరయి విజయన్ కు ఈ మేరకు లేఖ కేరళ మెడికల్ ఆఫీసర్స్ అసోసియేషన్ రాసింది. కేంద్రం నుంచి పెద్ద మొత్తంలో వ్యాక్సిన్ కేటాయింపులు జరగకపోతే విషమ పరిస్థితులు ఏర్పడే ప్రమాదముందని కేరళ మెడికల్ ఆఫీసర్స్ ఆందోళన వ్యక్తం చేశారు.
గత 24 గంటల్లో కేరళలో దాదాపు 14 వేల కేసులు నమోదయ్యాయి.