మహారాష్ట్రలోని బుల్దానాలో రెండు బస్సులు ఢీకొన్నాయి. ఈ దుర్ఘటనలో ఆరుగురు మృతిచెందారు. మరో 21 మంది గాయపడ్డారు. శనివారం తెల్లవారు జామున 3.30 నిమిషాల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. మల్కాపూర్ ఏరియాలోని నందూర్ నాకా ఫ్లైఓవర్ మీద ఈ ప్రమాదం జరిగింది. బాలాజీ ట్రావెల్స్‌కు చెందిన ఓ బస్సు హింగోలి జిల్లాకు వెళ్తోంది. ఆ బస్సులో అమర్‌నాథ్ నుంచి వస్తున్న యాత్రికులు ఉన్నారు. రాయల్ ట్రావెల్స్ కంపెనీకి చెందిన మరో బస్సు నాసిక్ వెళ్తున్నట్లు అధికారులు చెప్పారు.
బస్సు ప్రమాదంలో స్వల్పంగా గాయపడ్డ 32 మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. వారికి స్థానికంగా ఉన్న గురుద్వారాలో చికిత్సను అందిస్తున్నారు. అమర్‌నాథ్ నుంచి తిరిగి వస్తున్న బస్సుకు చెందిన డ్రైవర్ ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. రోడ్డు మీద నుంచి బస్సుల్ని తొలగించిన తర్వాత మళ్లీ ట్రాఫిక్‌ను పునరుద్దరించినట్లు హైవే పోలీసులు వెల్లడించారు.
బుల్దానా జిల్లాలో ఇటీవలే భారీ బస్సు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. జూలై ఒకటో తేదీన ఓ బస్సులో అగ్నిప్రమాదం జరగడంతో.. దాంట్లో ఉన్న 25 మంది ప్రయాణికులు సజీవంగా సమాధి అయ్యారు. సమృద్ధి-మహామార్గ్ ఎక్స్‌ప్రెస్‌పై ఆ ఘటన జరిగింది.