Sunday, May 19, 2024
HomeTrending NewsBabu Tour: పెన్నా టు వంశధార యాత్ర : అచ్చెన్నాయుడు

Babu Tour: పెన్నా టు వంశధార యాత్ర : అచ్చెన్నాయుడు

వ్యవసాయ, సాగునీటి రంగాలపై ప్రభుత్వం దృష్టి పెట్టినప్పుడే  రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. వ్యవసాయం బాగుండాలంటే సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయాల్సి ఉంటుందని, కానీ నాలుగున్నర సంవత్సరాలుగా ఈ రంగాలను  జగన్ ప్రభుత్వం పూర్తిగా భ్రష్టు పట్టించిందని  విమర్శించారు. క్రాప్ హాలిడే ఇస్తే సుఖంగా ఉంటుందన్న భావనలో రైతులు ఉన్నారన్నారు.  మంత్రులు, అధికార పార్టీ నేతలు దోచుకోవడం, ఎదురుదాడి చేయడం తప్ప అభివృద్ధిపై దృష్టి పెట్టడం లేదన్నారు. మంగళగిరిలోని టిడిపి కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.

‘పెన్నా టు వంశధార’ పేరుతో ఆగస్టు 1 నుంచి పదిరోజులపాటు చంద్రబాబు నాయుడు ప్రాజెక్టులను సందర్శిస్తారని అచ్చెన్నాయుడు వెల్లడించారు.  ఇరిగేషన్ ప్రాజెక్టులపై రాష్ట్ర ప్రజలను, రైతాంగాన్ని చైతన్య పరిచేందుకే ఈ కార్యక్రమం చేపడుతున్నామని , కొన్ని ప్రాజెక్టులను ప్రీ క్లోజర్ చేసిన విధానంపై బాబు ప్రజలకు వివరాలు వెల్లడిస్తారని, ఆ ప్రదేశాల్లోనే ఫొటో ఎగ్జిబిషన్, పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తారని వివరించారు. ప్రాజెక్టులపై ఈ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు, దమనకాండపై ప్రజల్లో ఆగాహన కలిగిస్తారన్నారు.  ఎన్టీఆర్, చంద్రబాబులు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం కోసం కృషి చేశారని తెలిపారు.

తెలుగుదేశం పార్టీ హయంలో ఆయా జిల్లాల్లోని ప్రాజెక్టులపై ఎంత ఖర్చు చేసిందీ, ఈ నాలుగేళ్ళలో జగన్ ప్రభుత్వంఎంత వ్యయం చేసిందీ తెలియజేస్తామన్నారు. కొన్ని ప్రాజెక్టులను ప్రీ క్లోజర్ చేయడం దారుణమన్నారు. 1వ తేదీన ఉమ్మడి కర్నూలు జిల్లా ముచ్చుమర్రి దగ్గర ప్రారంభించి, గండికోట, అనంతపురం, మదనపల్లి హంద్రీ నీవా, తిరుపతి బాలాజీ ప్రాజెక్టు, గుండ్లకమ్మ, పోలవరం, పట్టి సీమ, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి. తోటపల్లి, వంశధార ప్రాజెక్టు వద్ద యాత్ర ముగుస్తుందని చెప్పారు.

నాలుగేళ్ల జగన్ పాలనలో రాష్ట్ర తీవ్రమైన అన్యాయానికి గురైందని… మేధావులు, విజ్ఞులు, ప్రజలు, రైతు సోదరులు అందరూ మేల్కోవాలని పిలుపు ఇచ్చారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్