Monday, June 15, 2026
HomeTrending NewsFloods: ప్రత్యేకంగా పారిశుద్ధ్య డ్రైవ్ - మంత్రి కేటిఆర్

Floods: ప్రత్యేకంగా పారిశుద్ధ్య డ్రైవ్ – మంత్రి కేటిఆర్

రాష్ట్రంలో గత వారం రోజులుగా భారీగా కురిసిన వర్షాలు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో తీసుకోవాల్సిన కార్యక్రమాల పైన పురపాలక శాఖ అధికారులకు మంత్రి కేటీఆర్ పలు సూచనలు ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా పారిశుద్ధ్య నిర్వహణ, సురక్షిత తాగునీటి సరఫరా, వాటర్ బార్న్ డిసీజెస్ రాకుండా చేపట్టాల్సిన వైద్య ఆరోగ్య కార్యక్రమాల పైన ప్రధానంగా ఈరోజు జరిగిన టెలికాన్ఫరెన్స్లో చర్చించారు. పురపాలక శాఖ ఉన్నతాధికారులు, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లు,  మున్సిపల్ కమిషనర్లతో పురపాలక శాఖ మంత్రి కే. తారక రామారావు ఈ రోజు టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు.

అధికారులకీ, సిబ్బందికి సెలవులను ఇప్పటికే రద్దు చేశామన్న కెటిఆర్ ఎట్టి పరిస్థితులలో ప్రాణ నష్టం జరగకుండా చూడడమే అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశంగా గుర్తించాలన్నారు. పట్టణాల్లో ఉన్న చెరువులు పూర్తిగా నిండాయి. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను అవసరమైతే తరలించండి. సహాయక కార్యక్రమాలు ఎలాంటి అవసరం ఉన్న స్వయంగా నా కార్యాలయంతో పాటు పురపాలక శాఖ ఉన్నతాధికారులంతా అందుబాటులో ఉంటారని మంత్రి కెటిఅర్ తెలిపారు. వర్షాలు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో సహాయక చర్యల పైన ఎక్కువ దృష్టి సారించండని, సహాయ కార్యక్రమాల సమన్వయం కోసం హైదరాబాద్ తో పాటు ప్రతి జిల్లాలోని కంట్రోల్ సెంటర్లను ఏర్పాటు చేసుకోవాలన్నారు.

పట్టణాల్లో ప్రధాన రహదారులపై పేరుకుపోయిన బురదను వెంటనే తొలగించే కార్యక్రమాలు చేపట్టాలని, ప్రతి పట్టణంలో ప్రత్యేకంగా పారిశుద్ధ్య డ్రైవ్ ని చేపట్టాలని మంత్రి స్పష్టం చేశారు. అవసరమైతే అదనపు సిబ్బందిని, అదనపు వాహనాలను సమకూర్చుకోవాలన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సురక్షిత తాగునీరును అందించాలని, సురక్షిత తాగునీరు సరఫరా కోసం మిషన్ భగీరథ అధికారులతో సమన్వయం చేసుకొని పైపులైన్ల లీకేజీలు వెంటనే మరమ్మతులు చేయడము, తాగునీటి క్లోరినేషన్ వంటి కార్యక్రమాలను వేగంగా చేపట్టాలన్నారు.

పట్టణాల్లో బస్తీ దవాఖానాలు ప్రభుత్వ వైద్య ఆరోగ్యశాఖ మరియు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వంటి సంస్థల సహకారంతో పెద్ద ఎత్తున మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. DMHOలతో సమన్వయం చేసుకొని అవసరమైన వైద్య ఆరోగ్య సంరక్షణ కార్యక్రమాలు చేపట్టాలన్నారు. మిగిలిపోయిన శిధిలావస్థలో ఉన్న పురాతన భవనాలను వెంటనే తొలగించాలని మంత్రి కేటిఆర్ అధికారులను ఆదేశించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular