Monday, March 9, 2026
HomeTrending NewsMorocco: మొరాకోలో బస్సు ప్రమాదం..24 మంది మృతి

Morocco: మొరాకోలో బస్సు ప్రమాదం..24 మంది మృతి

ఉత్తర ఆఫ్రికా దేశమైన మొరాకోలో ఘోర బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. సెంట్రల్‌ మొరాకోలోని అజిలాల్‌ ప్రావిన్స్‌ లో ప్రయాణికులతో వెళ్తున్న బస్సు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో సుమారు 24 మంది ప్రాణాలు కోల్పోయినట్లు స్థానిక వార్తా సంస్థ తెలిపింది.

డెమ్నేట్‌ లోని వీక్లీ మార్కెట్‌ కు వెళ్తోన్న మినీ బస్సు రోడ్డు మలుపు వద్ద అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 24 మంది ప్రయాణికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదం గురించి సమాచారం అందగానే రాయల్‌ జెండర్‌ మెరీ, సివిల్‌ ప్రొటెక్షన్‌ అధికారులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. ఘటనకు గల కారణాలను తెలుసుకునేందుకు దర్యాప్తు ప్రారంభించినట్లు అధదికారులు తెలిపారు. కాగా, గతేడాది ఆగస్టులో కాసాబ్లాంకాకు తూర్పున జరిగిన బస్సు ప్రమాదంలో 23 మంది మరణించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular