Saturday, January 18, 2025
HomeTrending Newsతమిళనాడు బాణసంచా కేంద్రంలో అగ్నిప్రమాదం

తమిళనాడు బాణసంచా కేంద్రంలో అగ్నిప్రమాదం

తమిళనాడు రాష్ట్రంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఆరుగురు వ్యక్తులు సజీవ దహనం అవగా.. 10 మంది మంటల్లో చిక్కుకున్నారు. తమిళనాడులోని శంకరాపురంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. కల్లకురిచి జిల్లా శంకరాపురంలోని బాణసంచా కేంద్రంలో ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మంటల్లో ఆరుగురు సజీవదహనం అయ్యారు. మరో 10 మంది కార్మికులు మంటల్లో చిక్కుకున్నారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది, రెస్క్యూ టీమ్.. రెస్క్యూ ఆపరేన్ నిర్వహిస్తున్నారు. మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. కాగా, భారీగా మంటలు ఎగసిపడుతుండటంతో అక్కడ పరిస్థితి భయానకంగా కనిపిస్తోంది.

ప్రమాద వివరాలను ఎంకే స్టాలిన్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. మృతుల కుటుంబాలకు ఒక్కరికి ఐదు లక్షల చొప్పున, గాయపడ్డ వారికి లక్ష రూపాయల చొప్పున తమిళనాడు ప్రభుత్వం సాయం ప్రకటించింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్