Monday, June 15, 2026
Homeసినిమా'భోళా శంకర్' కోసం భారీ కోల్ కతా సెట్

‘భోళా శంకర్’ కోసం భారీ కోల్ కతా సెట్

మెగాస్టార్ చిరంజీవి తాజా చిత్రం వాల్తేరు వీరయ్య అద్భుతమైన విజయం సాధించింది. తొలి మూడు రోజులకే  ప్రపంచ వ్యాప్తంగా 108 కోట్ల రూపాయల గ్రాస్ సంపాదించి రికార్డు సృష్టించింది. చిరంజీవి తనదైన నటనతో ప్రేక్షకులను మెప్పించారు. ఆయన కామెడీ టైమింగ్, జంబలకిడి జారు మిఠాయి పాత అనుకరణ, ఎమోషన్ సన్నివేశాల్లో అయన నటన విశేషంగా ప్రేక్షకులను అలరిస్తోంది.

ఈ సినిమా తర్వాత మెహర్ రమేష్ దర్శకత్వంలో ‘భోళా శంకర్’ లో చిరు నటిస్తున్నారు. ఏకే ఎంటర్ టైన్మెంట్, క్రియేటివ్ కమర్షియల్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి మహతి స్వర సాగర్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇప్పటికే తొలి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమాలో హీరోయిన్ గా తమన్నా నటిస్తుండగా, చిరు సోదరి పాత్రను కీర్తి సురేష్ పోషిస్తోంది. తాజాగా ఈ సినిమా కోసం కోల్ కతా భారీ సెట్ ను నిర్మించారు. ఈ సెట్ లో ఏర్పాటు చేసిన కాళికా మాత ఫోటోతో దర్శకుడు మెహర్ రమేష్, నిర్మాత అనిల్ సుంకర కలిసి దిగిన ఫోటోను షేర్ చేశారు.

వీరయ్య అందించిన విజయంతో రెట్టించిన ఉత్సాహంతో ఈ సినిమా రెండో షెడ్యూల్ ను మంగళవారం మొదలు పెట్టారు.  చిరంజీవి కూడా మెహర్ రమేష్ తో దిగిన ఫోటోను షేర్ చేస్తూ అదే ఉత్సాహంతో  భోళా శంకర్ రెండో షెడ్యూల్ ను మొదలు పెడుతున్నట్లు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular