Saturday, June 13, 2026
Homeసినిమాప్రశాంత్ నీల్ రావణం హీరో ఎవరు..?

ప్రశాంత్ నీల్ రావణం హీరో ఎవరు..?

ప్రశాంత్ నీల్ ఓ సంచలనం. కేజీఎఫ్ సినిమాతో టాలీవుడ్ దృష్టిని, ‘కేజీఎఫ్ 2’తో బాలీవుడ్ ని ఆకర్షించాడు. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో ‘సలార్’ అనే భారీ చిత్రం చేస్తున్నాడు. ఇందులో ప్రభాస్ కు జంటగా శృతిహాసన్ నటిస్తుంది. ఈ మూవీ ఫస్ట్ లుక్ అండ్ పోస్టర్స్ మూవీ పై భారీ అంచనాలు క్రియేట్ చేశాయి. బాహుబలి హీరో ప్రభాస్, కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో సలార్ మూవీ వస్తుండడంతో బాలీవుడ్ ఆడియన్స్ సైతం ఎప్పుడెప్పుడు సలార్ విడుదల అవుతుందా..? అని ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

సలార్ తర్వాత ప్రశాంత్ నీల్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో భారీ పాన్ ఇండియా మూవీ చేయనున్నారు. ఆతర్వాత రామ్ చరణ్ తో కూడా ప్రశాంత్ నీల్ మూవీ ఉంటుందని వార్తలు వచ్చాయి. అయితే.. ఇప్పుడు టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు.. ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో రావణం అనే సినిమా చేయబోతున్నట్టుగా ప్రకటించారు. ఈ మూవీ భారీ విజువల్ ఎఫెక్ట్స్ తో రూపొందనుందని దిల్ రాజు తెలియచేశారు. ఆ మూవీ ఎంతో భారీ బడ్జెట్ తో తెరకెక్కనుందని త్వరలోనే దాని డీటెయిల్స్ అధికారికంగా వెల్లడిస్తాం అని అన్నారు.

అయితే.. ఈ సినిమాలో హీరోగా ఎవరు నటిస్తారు అనేది ప్రకటించలేదు. ఈ వార్త బయటకు వచ్చినప్పటి నుంచి రావణం మూవీలో హీరో ఎవరు అనేది ఆసక్తిగా మారింది. లేటెస్ట్ న్యూస్ ఏంటంటే… ప్రభాస్ తో దిల్ రాజు ఎప్పటి నుంచో మూవీ చేయాలి అనుకుంటున్నారు. ఇప్పటికీ సెట్ అయ్యిందని.. రావణం మూవీలో హీరో ప్రభాస్ అని వార్తలు వస్తున్నాయి. ఎన్టీఆర్ 31వ మూవీ చేయనున్న ప్రశాంత్, ఆ పైన ప్రభాస్, దిల్ రాజుల రావణం మూవీ చేస్తారని టాక్ వినిపిస్తోంది. మరి.. ప్రచారంలో ఉన్న వార్త వాస్తవమేనా..? కాదా అనేది తెలియాల్సివుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular