Thursday, June 18, 2026
HomeTrending Newsరేపు బిపిపి పార్కుల మూసివేత

రేపు బిపిపి పార్కుల మూసివేత

హైదరాబాద్ బుద్ధ పూర్ణిమ ప్రాజెక్ట్ (బిపిపి) పరిధిలోని అన్ని పార్కులు, రెస్టారెంట్లు ఈనెల 14వ తేదీన మూసివేస్తున్నట్లు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ (హెచ్ఎండిఏ) తెలిపింది. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి పురస్కరించుకొని బుద్ధ పూర్ణిమ ప్రాజెక్టు పరిధిలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ భారీ విగ్రహాన్ని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు ఆవిష్కరించనున్న సందర్భంగా ప్రజల సౌకర్యార్థం ఈ నిర్ణయం తీసుకున్నట్లు హెచ్ఎండిఏ ఒక ప్రకటనలో వివరించింది.

ఎన్టీఆర్ గార్డెన్, లుంబిని పార్క్, ఎన్టీఆర్ ఘాట్, పిట్ స్టాప్, జలవిహార్, సంజీవయ్య పార్క్, అమోఘం రెస్టారెంట్ తదితర సందర్శన స్థలాలను ఈనెల 14వ తేదీ (శుక్రవారం) నాడు మూసివేస్తున్నట్లు హెచ్ఎండిఏ పేర్కొంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular