Thursday, June 18, 2026
HomeసినిమాSalaar: 'సలార్' టీజర్ రిలీజ్ ఎప్పుడు..?

Salaar: ‘సలార్’ టీజర్ రిలీజ్ ఎప్పుడు..?

ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ భారీ చిత్రం ‘సలార్’. ఈ చిత్రానికి ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో ప్రభాస్ కు జంటగా శృతి హాసన్ నటిస్తుంది. కేజీఎఫ్ సినిమాతో ప్రశాంత్ నీల్ ఓ ట్రెండ్ క్రియేట్ చేశాడు. ఇప్పటి వరకు తెర పై సినిమాను కలర్ ఫుల్ గా చూపించేవారు కానీ ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ సినిమాతో స్ర్కీన్ అంతా మట్టితో నింపేశారు. ఇది ఇప్పుడు ఓ ట్రెండ్ గా మారింది. మట్టి కథలు వరుస పెట్టి వస్తున్నాయి. సలార్ కూడా అలాంటి మట్టి కథ కావడంతో ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి.

సలార్ ఫస్ట్ లుక్ లో ప్రభాస్ పవర్ ఫుల్ గా కనిపించడంతో సినిమా ఇంకెంత పవర్ ఫుల్ గా ఉంటుందో అనేది ఆసక్తిగా మారింది. దీంతో ఎప్పుడెప్పుడు సలార్ టీజర్ రిలీజ్ చేస్తారా అని అభిమానులు ఎదురు చూస్తున్నారు. తాజా వార్త ఏంటంటే… సలార్ టీజర్ ను త్వరలోనే విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే టీజర్ ను రెడీ చేసి ఉంచారట. ఆదిపురుష్ సినిమా జూన్ 16న విడుదల అవుతుంది. ఈ సినిమా విడుదలైన కొన్ని రోజుల తర్వాతనే సలార్ సందడిని మొదలు పెట్టాలని మేకర్స ఫిక్స్ అయినట్లు సమాచారం.

అంతా అనుకున్నట్టుగా జరిగితే జూన్ చివరి వారంలోనే సలార్ సినిమాకు సంబంధించిన స్పెషల్ టీజర్ వచ్చే అవకాశం ఉంది. అభిమానులు  కోరుకుంటున్న  అంశాలన్నీ కూడా ఈ సినిమాలో ఉంటాయని ఇది వరకే దర్శకుడు ప్రశాంత్ నీల్ చెప్పారు. ఇక టీజర్ తో పాటు కొన్ని స్పెషల్ పోస్టర్స్ కూడా బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ చేసే విధంగా ప్రశాంత్ ప్లాన్ రెడీ చేసినట్టుగా టాక్ వినిపిస్తోంది. సెప్టెంబర్ 28న సలార్ మూవీ రిలీజ్ కానుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular