జగిత్యాల పట్టణంలో LG రాం లాడ్జి వెనుక రోడ్డు కు ఆనుకొని ఉన్న చెట్టును నరికిన వ్యక్తికి ₹ 5000 జరిమానా విధించిన మున్సిపల్ అధికారులు.
తాను నాటిన చెట్టును నరికిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ నరికిన చెట్టు వద్ద ప్రభాకర్ అనే వ్యక్తి నిరసన దీక్ష. పర్యావరణ పరిరక్షణకు పురపాలక సంఘం సహకరించాలని వినతి.
చెట్టును నరికిన రాజేశం పై చర్యలు తీసుకోవాలని రోడ్డుపైనే బైటాయించారు. వెంటనే స్పందించిన మున్సిపల్ అధికారులు చెట్టు ను తొలగించిన వ్యక్తికి ₹ 5000 జరిమానా విధించారు. అదే చోట మరో మొక్కను నాటిన మున్సిపల్ అధికారులు.

‘ఐ’ధాత్రి న్యూస్ డెస్క్ లో అనుభవజ్ఞులయిన జర్నలిస్టులు, కాపీ ఎడిటర్లు, అనువాదకులు, డిజైనర్లు, డిజిటల్ మీడియా సాంకేతిక నిపుణులు పనిచేస్తుంటారు.