Monday, January 20, 2025
HomeTrending NewsChile: చిలీలో భారీ భూకంపం..రిక్టర్‌ స్కేలుపై 6.2గా నమోడు

Chile: చిలీలో భారీ భూకంపం..రిక్టర్‌ స్కేలుపై 6.2గా నమోడు

భారీ భూకంపంతో చిలీ వణికిపోయింది. బుధవారం రాత్రి 10.48 గంటలకు (స్థానిక కాలమాణం ప్రకారం) ఉత్తర చిలీలో భారీ భూకంపం వచ్చింది. రిక్టర్‌ స్కేలుపై దీని తీవ్రత 6.2గా నమోదయింది. భూకంప కేంద్రం కాక్వింబోకు 41 కిలోమీటర్ల దూరంలో ఉన్నదని యూఎస్‌ జియోలాజికల్‌ సర్వే వెల్లడించింది. భూ అంతర్భాగంలో 41 కిలోమీటర్ల లోతులో కదలికలు సంభవించాయని తెలిపింది. రాత్రివేళ భూమి కంపించడంతో ప్రజలు ఇండ్ల నుంచి రోడ్లపైకి పరుగులు తీశారు. భూకంపం వల్ల జరిగిన నష్టానికి సంబంధించిన వివరాలు తెలియరాలేదని అధికారులు చెప్పారు.

చిలీని రింగ్‌ ఆఫ్‌ ఫైర్‌గా పిలుస్తారు. పసిఫిక్‌ తీరంలో ఉన్న ఈ దేశం అగ్నిపర్వతాలకు నెలవుగా ఉన్నది. దీంతో ఇక్కడ తరచూ భూకంపాలు సంభవిస్తూ ఉంటాయి. 2010లో 8.8 తీవ్రతతో వచ్చిన భారీ భూకంపం వల్ల 526 మంది మరణించారు. భూకంపం ధాటికి భారీ సునామీ కూడా వచ్చింది. దీనివల్ల ప్రాణ నష్టం ఎక్కువగా సంభవించింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్