Saturday, January 18, 2025
HomeTrending Newsఢిల్లీ, పాట్నా హైకోర్టులకు కొత్త న్యాయమూర్తులు

ఢిల్లీ, పాట్నా హైకోర్టులకు కొత్త న్యాయమూర్తులు

ఢిల్లీ హైకోర్టుకు ఏడుగురు కొత్త న్యాయమూర్తులను సిఫారసు చేస్తూ సుప్రీం కోర్టు కోలీజియం నిర్ణయం తీసుకుంది. వికాస్ మహాజన్, తుషార్ రావు గేదెల, మాన్ మీత్ ప్రీతం సింగ్ అరోరా, సచిన్ దత్తా, అమిత్ మహాజన్, గౌరాంగ్ కాంత్, సౌరబ్ బెనర్జీ ఉన్నారు. వీరితో పాటు బిహార్ రాష్ట్రానికి చెందిన ఏడుగురు జడ్జీలకు న్యాయముర్తులుగా పదోన్నతి ఇవ్వాలని కొలిజియం సిఫారసు చేసింది. వారిలో శైలేంద్ర సింగ్ , అరుణ్ కుమార్ ఝ, జితేంద్ర కుమార్, అలోక్ కుమార్ పాండే, సునీల్ దత్త మిశ్ర, చంద్ర ప్రకాష్ సింగ్ , చంద్ర శేఖర్ ఝ ఉన్నారు. వీరితో పాటు ఆంధ్రప్రదేశ్ హై కోర్టుకు మహబూబ్ సుభాని షేక్ పేరును కొలిజియం సిఫారసు చేసింది.  సీజేఐ ఎన్వీ రమణ సారథ్యంలో- జస్టిస్ ఉదయ్ ఉమేష్ లలిత్, జస్టిస్ అజయ్ మాణిక్‌రావ్ ఖన్విల్కర్‌తో కూడిన కొలీజియం ఈ జాబితాను రూపొందించింది. దాన్ని కేంద్రానికి పంపించింది.

తాజా ప్రతిపాదనలతో ఏపీ హైకోర్టుకు కొత్త న్యాయమూర్తి రానున్నారు. ఏపీ సహా ఢిల్లీ, పాట్నా హైకోర్టులకు కొత్త న్యాయమూర్తుల పేర్లతో కూడిన జాబితాను సుప్రీం కోర్టు కోలీజియం కేంద్ర ప్రభుత్వానికి పంపించింది. దీనిపై కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ ఆమోద ముద్ర వేయాల్సి ఉంది. ఒకట్రెండు రోజుల్లో ఆమోదం లభిస్తుందని తెలుస్తోంది.

ఈ జాబితాలో మొత్తం 15 మంది న్యాయవాదులు, న్యాయాధికారులు ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆ జాబితాను యధాతథంగా ఆమోదించడమంటూ జరిగితే- ఈ 15 మందిలో ఒకరు ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా అపాయింట్ అవుతారు. పాట్నా, ఢిల్లీ హైకోర్టులకు ఏడుమంది చొప్పున కొత్త న్యాయమూర్తులు నియమితులవుతారు.

Also Read : న్యాయమూర్తులకు లక్ష్మణరేఖ: జస్టిస్ రమణ 

RELATED ARTICLES

Most Popular

న్యూస్