Sunday, May 18, 2025
HomeTrending Newsశ్రీహరికోట షార్ లో వరుస ఆత్మహత్యలు

శ్రీహరికోట షార్ లో వరుస ఆత్మహత్యలు

ఆంధ్రప్రదేశ్ లోని శ్రీహరికోట భారత అంతరిక్ష పరిశోధన సంస్థ షారులో మరొక దారుణం చోటు చేసుకుంది. సోమవారం రాత్రి తన సర్వీసు రివాల్వర్ తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్న CISF SI వికాస్ సింగ్…ఈ రోజు ఆయన భార్య షార్ లోని ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఇప్పటికే కానిస్టేబుల్ చింతామణి చెట్టుకు ఉరేసుకోవడం… SI వికాస్ సింగ్..తన గన్ తో కాల్చుకుని బలవన్మరణానికి పాల్పడడంతో షార్ లో కలకలం రేగింది. ముగ్గురు పిల్లలున్న వికాస్ సింగ్ భార్య సూసైడ్ చేసుకోవడంతో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

సిఐఎస్ఎఫ్ ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న వికాస్ సింగ్ అనే వ్యక్తిగత సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. నిన్నరాత్రి భర్తను చూడటానికి శ్రీహరి కోట వచ్చిన భార్య ప్రియాంక సింగ్ ఆత్మహత్య చేసుకున్నారు. అర్ధరాత్రి నర్మదా గెస్ట్ హౌస్ లో ఫ్యాన్ కు ఊరి వేసుకుని ఆత్మహత్య ఒడిగట్టింది. ఆర్థిక సమస్యలు..కొడుకు అనారోగ్యం కారణం అయినట్లు తెలుస్తోంది. ఎస్సై వికాస్ సింగ్ ఉత్తరప్రదేశ్ కు చెందిన వ్యక్తి కాగా కేవలం మూడు నెలల క్రితమే శ్రీహరికోటలో ఎస్సైగా చేరారు. ఎస్సై వికాస్ సింగ్ కి ముగ్గురు పిల్లలు..వీరు ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ లో ఉన్నారు. ఎస్సై వికాస్ సింగ్ మృతి పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన తోటి సిబ్బంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్