ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో జరిగిన ఘోర రైలు ప్రమాదం పలు కుటుంబాల్లో విషాదం నింపింది. రెండు ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఢీకొన్నఈ ఘటనలో గాయపడిన 400మందిలో 233 మందికి పైగా మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన వాళ్లలో మరికొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలిస్తోంది. ప్రాణ భయంతో కొందరు బోగీలో చిక్కుకున్నారని, దాంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని రైల్వే అధికారులు తెలిపారు. ఈ ఘటన జరిగిన కాసేపటికే యశ్వంతపూర్ – ఔరా కూడా ప్రమాదానికి గురైనట్టు ఒడిశా చీఫ్ సెక్రటరీ ప్రదీప్ జెనా వెల్లడించాడు.
పట్టాలు తప్పిన కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ ఆ పక్కనే వెళ్తున్న యశ్వంతపూర్ – ఔరా ఎక్స్‌ప్రెస్‌ను ఢీ కొట్టింది. దాంతో, అందులోని ప్రయాణికులు భయంతో వణికిపోయారు. ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. గాయపడ్డవారిని ఆస్పత్రికి తరలించేందుకు 50 అంబులెన్స్‌లు సరిపోకపోవడంతో.. బస్సులను ఏర్పాటు చేశారు.
Odisha Train Accident: Helpline Numbers
-Shalimar: 9903370746
-Howrah: 033-26382217
-Balasore: 8249591559/7978418322