Thursday, March 12, 2026
HomeTrending NewsKarnataka Assembly: కర్ణాటక అసెంబ్లీ వద్ద మహిళ కలకలం

Karnataka Assembly: కర్ణాటక అసెంబ్లీ వద్ద మహిళ కలకలం

కర్ణాటకలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల వేళ ఇటీవలే ఓ సామాన్య వ్యక్తి ఎమ్మెల్యే స్థానంలో కూర్చున్న విషయం తెలిసిందే. ఈ ఘటన ఆ రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. అది మరవకముందే తాజాగా అలాంటి ఘటనే మరొకటి చోటు చేసుకుంది. ఈ రోజు (సోమవారం) ఉదయం ఓ మహిళ కత్తితో విధాన సౌధలోకి ప్రవేశించేందుకు యత్నించడం కలకలం రేపింది.

విధాన సౌధ వద్ద ఇటీవలే చోటు చేసుకున్న భద్రతా వైఫల్యాన్ని దృష్టిలో పెట్టుకుని కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్కరినీ తనిఖీ చేసిన తర్వాతే లోపలికి అనుమతిస్తున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం ఓ మహిళను తనిఖీ చేయగా.. ఆమె బ్యాగులో కత్తి ఉండటాన్ని భద్రతా సిబ్బంది గుర్తించింది. కత్తిని స్వాధీనం చేసుకున్న పోలీసులు సదరు మహిళను అదుపులోకి తీసుకున్నారు. ఘటనపై విచారణ చేపడుతున్నారు.

కాగా, భద్రతా ఉల్లంఘనల అనంతరం స్పీకర్ యూటీ ఖాదర్ విధాన సౌధ వద్ద ఉన్న అన్ని ఎంట్రీ పాయింట్లను తనిఖీ చేశారు. ‘ఈ రోజు అసెంబ్లీ ప్రాంగణం వద్ద తనిఖీలు చేపట్టారు. విధాన సౌధను అందరికీ సురక్షితంగా ఉంచడానికి మేము ప్రయత్నిస్తున్నాము. ఇక్కడికి నిత్యం చాలా మంది ప్రజలు వస్తుంటారు. వారి పనులు సజావుగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నాము’ అని తనిఖీల అనంతరం స్పీకర్ తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular