Friday, March 20, 2026
Homeసినిమాఫ్యాన్సీ రేటుకు అమ్ముడైన ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’

ఫ్యాన్సీ రేటుకు అమ్ముడైన ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’

Fancy Rate: హీరో శర్వానంద్ హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘ఆడ‌వాళ్లు మీకు జోహార్లు’. ర‌ష్మిక మంద‌న్న హీరోయిన్‌. తిరుమ‌ల కిషోర్‌ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. శివ‌రాత్రి సంద‌ర్భంగా ఈ సినిమా ఫిబ్ర‌వ‌రి 25న విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతుంది. క్రేజీ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న చిత్రం కావ‌డంతో సినిమా పై మంచి అంచ‌నాలే ఏర్ప‌డ్డాయి. దీంతో ట్రేడ్ వ‌ర్గాల స‌మాచారం మేర‌కు ‘ఆడ‌వాళ్లు మీకు జోహార్లు’ సినిమా నాన్ థియేట్రికల్ హక్కులు ఫ్యాన్సీ రేటుకు అమ్ముడయ్యాయని సమాచారం. కేవలం నాన్ థియేట్రికల్ హక్కులే రూ.25 కోట్లకు హాట్ కేకుల్లా పోటీతో దక్కించుకున్నారని టాక్.

సోనీ లివ్ సంస్థ డిజిటల్, శాటిలైట్ హక్కులను దక్కించుకోగా ఆడియో హక్కులను లహరి సంస్థ దక్కించుకుందని తెలుస్తోంది. శర్వానంద్‌ను స‌రికొత్త కోణంలో ప్రెజంట్ చేస్తూ తిరుమ‌ల కిషోర్ ఈ సినిమాను ఔట్ అండ్ ఔట్ ఎంటర్‌టైనర్‌గా మలుస్తున్నారు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీత సారథ్యం వహించిన ఈ సినిమాలో తొలి పాట రీసెంట్‌గా విడుదలై మంచి ఆదరణను రాబట్టుకుంది. ఫిబ్రవరి 10న సినిమా టీజర్ విడుదలకు సిద్ధమవుతుంది. ఖుష్బూ, రాధిక శరత్ కుమార్, ఊర్వశి తది తరులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

Also Read : ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ నుంచి టైటిల్ సాంగ్ రిలీజ్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular