Saturday, July 27, 2024
Homeస్పోర్ట్స్హాకీ: సౌతాఫ్రికాను చిత్తు చేసిన ఇండియా

హాకీ: సౌతాఫ్రికాను చిత్తు చేసిన ఇండియా

India Beat SA: నిన్న ఫ్రాన్స్ పై ఘన విజయం సాధించిన ఇండియా నేడు ఆతిథ్య సౌతాఫ్రికాను కూడా 10-2 స్కోరుతో చిత్తు చేసి సత్తా చాటింది. ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పురుషుల ఎఫ్.ఐ.హెచ్. ప్రో లీగ్ 2021-22 లో భాగంగా నేడు ఇండియా-సౌతాఫ్రికా మధ్య మ్యాచ్ జరిగింది.

సౌతాఫ్రికా లోని యూనివర్సిటీ అఫ్ నార్త్ వెస్ట్ పోట్చెఫ్ స్ట్రామ్ మైదానంలో జరిగిన ఈ మ్యాచ్ లో ఆట 2వ నిమిషంలోనే  ఇండియా ఆటగాడు హర్మన్ ప్రీత్ సింగ్ పెనాల్టీ కార్నర్ ను గోల్ గా మలిచి ఖాతా తెరిచాడు. 4, 6వ నిమిషాల్లో జుగ్ రాజ్ సింగ్ రెండు గోల్స్ సాధించాడు. 12వ నిమిషంలో అభిషేక్ మరో గోల్ చేశాడు.  23, 24, 25, 27 నిమిషాల్లో ఇండియాకు మరో నాలుగు గోల్స్ లభించాయి. తొలి అర్ధ భాగం పూర్తయ్యే నాటికి ఇండియా 8-0 గోల్స్ తో ఆధిక్యంలో నిలిచింది. 36వ నిమిషంలో గుర్షా హిబ్జిత్ సింగ్, 58వ నిమిషంలో గుర్ ప్రీత్ సింగ్ చెరో గోల్ సాధించడంతో ఇండియా సాధించిన గోల్స్ సంఖ్య 10కి చేరింది.  వీటిలో 4 పెనాల్టీ కార్నర్, 6 ఫీల్డ్ గోల్స్ ఉన్నాయి. జుగ్ రాజ్ సింగ్ మూడు గోల్స్ చేశాడు.

సౌతాఫ్రికా 44, 45 నిమిషాల్లో రెండు గోల్స్ సాధించింది వీటిలో ఒకటి పెనాల్టీ కార్నర్, రెండవది ఫీల్డ్ గోల్.

ఇండియా తన తర్వాత మ్యాచ్ ఫిబ్రవరి 12న ఫ్రాన్స్ తో ఆడనుంది.

Also Read :  హాకీ: ఫ్రాన్స్ పై ఇండియా ఘనవిజయం

RELATED ARTICLES

Most Popular

న్యూస్