భరత్, సంచిత శెట్టి, చాందిని తమిళ రసన్, ఖతీర్, రాధా రవి ,యోగ్ జపి, ఆత్మ పాట్రిక్, గడ్డం కిషన్ నటీనటులుగా అరుణ్ కృష్ణస్వామి దర్శకత్వంలో రూపొందిన చిత్రం “ఆట నాదే.. వేట నాదే’ . వీరాంజనేయులు & రాజ్యలక్ష్మి సమర్పణలో కుబేర ప్రసాద్ నిర్మించారు. అన్నికార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ చిత్రం అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతుంది.
“మనిషి తన ప్రేమను గెలిపించుకోవడం కోసం దేనికైనా తెగిస్తాడు అనేది సినిమా ఇతి వృత్తం. తనని తాను గెలుచుకోవడం కోసం తన మనసు నచ్చిన అమ్మాయిని గెలుచుకోవడం కోసం ఇద్దరు కుర్రాళ్లు ఈ ఆటలో పోటీపడి ఎలా నెగ్గారు. తన ప్రేమను ఎలా గెలిపించుకున్నారు తన జీవితంలో ఎలా గెలిచారు అనేదే మా ‘ఆట నాదే.. వేట నాదే’.. అంటే ఆట కోసం వేట మొదలెట్టాలి ఆ వేట సక్సెస్ అయితే మన ఆట ఆడి గెలిచినట్లే. అందుకే ఈ చిత్రానికి ఈ టైటిల్ పెట్టడం జరిగింది. సినిమా చాలా బాగా వచ్చింది అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం అక్టోబరు 2 న విడుదల చేస్తున్నాం. ఈ సినిమా ప్రేక్షకులందరికీ తప్పకుండా నచ్చుతుందని” నిర్మాతలు అన్నారు.

తెలుగు, జర్నలిజం, పాలిటిక్స్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్లు. ప్రింట్, టీవీ మీడియాల్లో 17 ఏళ్లు పాటు సినిమా జర్నలిస్టుగా అనుభవం. వివిధ సినీ వార పత్రికలు, దిన పత్రిక, ఎలెక్ట్రానిక్ మీడియాలో, వెబ్ సైట్ లో వర్క్ చేసిన అనుభవం.