Friday, June 12, 2026
HomeTrending Newsరేవంత్ రెడ్డి కాన్వాయ్‍కు ప్రమాదం

రేవంత్ రెడ్డి కాన్వాయ్‍కు ప్రమాదం

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఎల్లారెడ్డి పేట మండలం తిమ్మాపూర్ వద్ద టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కాన్వాయ్ కు యాక్సిడెంట్ జరిగింది. కాన్వాయ్ ఓవర్ స్పీడ్ లో రావడంతో 6 కార్లు బలంగా ఒకదానికొకటి ఢీకొనడంతో ఘటన చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది. ఈ సమయంలో ఒక్కసారిగా బెలూన్లు ఓపెన్ కావడంతో భారీ ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో 4 కార్లతో పాటు ఇద్దరు రిపోర్టర్ల కార్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. దీంతో కారులో ప్రయాణిస్తున్న వీ6, టీవీ 9, ఎన్టీవీ, ఏబీఎన్, సాక్షి, న్యూస్ నౌ, బిగ్ టీవీ రిపోర్టర్లు ఉన్నట్టు సమాచారం. స్వల్ప గాయాలతో సిరిసిల్ల రిపోర్టర్లు బయటపడ్డట్టు తెలుస్తోంది. కాగా ఈ ప్రమాదంలో ఎవరికీ ఏం కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular