Saturday, June 13, 2026
HomeTrending Newsత్వరలో నిజామాబాద్‌ ఐటీ హబ్‌ ప్రారంభం

త్వరలో నిజామాబాద్‌ ఐటీ హబ్‌ ప్రారంభం

నిజామాబాద్ జిల్లా కేంద్రంలో రూ. 50 కోట్లతో నిర్మిస్తున్న ఐటీ హబ్‌  ను త్వరలో ప్రారంభించనున్నామని ఎమ్మెల్సీ కల్లకుంట్ల కవిత వెల్లడించారు. శనివారం నిజామాబాద్‌లో ఐటీ హబ్‌ భవన సముదాయాన్ని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గణేశ్‌ గుప్తా, బీఆర్ఎస్ ఎన్నారై సెల్ కోఆర్డినేటర్ మహేశ్‌ గుప్తాతో కలిసి పరిశీలించారు. చివరి దశకు చేరుకున్న పనులను, భవనంలో మౌలిక సదుపాయాల వివరాలను ఆమె అడిగి తెలుసుకున్నారు. ద్వితీయ శ్రేణి నగరాలకు ఐటీ కంపెనీలను తీసుకువెళ్లాలని సంకల్పంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఐటీ హబ్ లను నిర్మిస్తున్నారని కవిత పేర్కొన్నారు. నిజామాబాద్ లో ఐటీ హబ్ నిర్మాణానికి ఎంతో శ్రద్ధ తీసుకున్న సీఎం కేసీఆర్, కేటీఆర్‌ కు ఆమె ధన్యవాదాలు తెలిపారు. అతి త్వరలో కేటీఆర్ చేతుల మీదుగా ఐటీ హబ్‌ను ప్రారంభిస్తామని వెల్లడించారు.

రూ. 50 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ఐటీ హబ్‌లో 750 మంది యువతకు, నాలుగు వేల మంది ఇతర ప్రాంతవాసులకు ఉద్యోగ,ఉపాధికి అవకాశం లభిస్తుందని తెలిపారు.‘ ఇంకా ఎన్నో పరిశ్రమలు నిజామాబాద్ కు రానున్నాయి. ఇప్పటికే 200 పై చిలుకు సీట్లు ఒప్పందాలు పూర్తి అయ్యాయ’ ని అన్నారు.దేశ వ్యాప్తంగా ఐటీ ఎక్స్‌పోర్ట్‌లో రాష్ట్రం రెండవ స్థానం లో ఉందని కవిత తెలిపారు.

తెలంగాణ లో కలలు కన్న ప్రగతి సాధ్యమౌతుందని అన్నారు.డిగ్రీ కళాశాల లతో ఒప్పందాలు పెట్టుకుంటామని ఆమె వివరించారు. జిల్లాలో విమానాశ్రయ ఏర్పాటు అంశాన్ని కూడా పరిశీలిస్తున్నామని ఎమ్మెల్సీ తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular