Friday, March 6, 2026
Homeజాతీయంప్రముఖ హాస్య నటుడు వివేక్‌ కన్నుమూత

ప్రముఖ హాస్య నటుడు వివేక్‌ కన్నుమూత

కోలీవుడ్‌ ప్రముఖ హాస్యనటుడు వివేక్‌ (59) కన్నుమూశారు. గురువారం మధ్యాహ్నం తీవ్ర గుండెపోటుతో చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో వివేక్‌ చేరిన విషయం తెలిసిందే. చికిత్స పొందుతూ శుక్రవారం తెల్లవారుజామున 4.30 గంటలకు ఆయన తుదిశ్వాస విడిచారు. వివేక్‌ ఆకస్మిక మరణంతో తమిళ చిత్రపరిశ్రమలో తీవ్ర దిగ్భ్రాంతి నెలకొంది.

వివేక్‌ మృతిపట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. ప్రముఖ దర్శకుడు కె.బాలచందర్‌ వెండితెరకు పరిచయం చేసిన నటుల్లో వివేక్‌ ఒకరు. బాలచందర్‌ దర్శకత్వం వహించిన ‘మనదిల్‌ ఉరుది వేండం’ అనే చిత్రంతో వివేక్‌ నటుడిగా తెరంగేట్రం చేశారు. అనంతరం ఆయన హాస్యనటుడిగా దాదాపు 300లకు పైగా చిత్రాల్లో నటించారు. కోలీవుడ్‌కు చెందిన స్టార్‌ హీరోలు రజనీకాంత్‌, సూర్య, అజిత్‌ చిత్రాల్లో వివేక్‌ హాస్యనటుడిగా మెప్పించారు. ‘శివాజీ’, ‘సింగం’, ‘సింగం-2’, ‘విశ్వాసం’ చిత్రాలతో వివేక్‌ తెలుగువారికి కూడా సుపరిచితులయ్యారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular