7.8 C
New York
Saturday, December 2, 2023

Buy now

HomeసినిమాMahima Nambiar: టాలీవుడ్ దృష్టిని ఆకర్షిస్తున్న మహిమ నంబియార్! 

Mahima Nambiar: టాలీవుడ్ దృష్టిని ఆకర్షిస్తున్న మహిమ నంబియార్! 

టాలీవుడ్ తెరపై అందాల భామలుగా వెలుగుతున్న చాలామంది కథనాయికలు కేరళ ప్రాంతం నుంచి వచ్చినవారే. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ నెంబర్ వన్ పొజీషన్ లో ఎక్కువకాలం పాటు చక్రం తిప్పినవారు చాలామందినే ఉన్నారు. ఇప్పుడు కూడా అక్కడివారి హవా ఇక్కడ ఒక రేంజ్ లో కొనసాగుతూనే ఉంది. తాజాగా ఆ వైపు నుంచి మరో బ్యూటీ ఇప్పుడు ఇక్కడి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ సుందరి పేరే ‘మహిమ నంబియార్’.

చక్కని కనుముక్కుతీరుతో .. ఆకర్షణీయమైన నవ్వుతో మహిమ ఇట్టే ఆకట్టుకుంటుంది. ఓ మలయాళ సినిమా ద్వారా ఆమె యాక్టింగ్ వైపు వచ్చి పుష్కర కాలమవుతోంది. మలయాళం నుంచి వచ్చినప్పటికీ, ఆమె తమిళ సినిమాలే ఎక్కువగా చేస్తూ వెళ్లింది. సెకండ్ హీరోయిన్ గా .. మెయిన్ హీరోయిన్ గా చేస్తూ, తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది. తమిళం వైపు నుంచి కొన్ని హిట్స్ ఆమె ఖాతాలో ఉన్నాయి. అక్కడ తన క్రేజ్ ను పెంచుకుంటూ ముందుకు వెళ్లడంలో ఆమె సక్సెస్ అయింది.

అలాంటి ఆమె ఇప్పుడు ‘చంద్రముఖి 2’ సినిమాతో ఈ నెల 28వ తేదీన తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో టైటిల్ రోల్ ను కంగనా చేయగా, మరో ముఖ్యమైన పాత్రలో మహిమ నంబియార్ నటించింది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంటులో ఆమె గలగలమని మాట్లాడటమే కాదు .. పాటలు పాడింది .. లారెన్స్ తో కలిసి స్టెప్పులు కూడా వేసింది. ఈవెంటుకి ఆమె ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. యూత్ నుంచి అయితే మంచి మార్కులు పడిపోయాయి. టాలీవుడ్ నుంచి ఆమెకి వరుస ఆఫర్లు వెళ్లడం ఖాయమనే టాక్ బలంగానే వినిపిస్తోంది మరి!

RELATED ARTICLES

Most Popular

న్యూస్