7.8 C
New York
Saturday, December 2, 2023

Buy now

HomeసినిమాChandramukhi 2 Pre Release: రజనీ స్టైల్ ప్రభావం మనపై అంతగా ఉంటుంది: లారెన్స్

Chandramukhi 2 Pre Release: రజనీ స్టైల్ ప్రభావం మనపై అంతగా ఉంటుంది: లారెన్స్

రజనీకాంత్ హీరోగా చేసిన ‘చంద్రముఖి’ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి చాలాకాలమే అయినా, ఆ సినిమాను ఎవరూ కూడా ఇంకా మరచిపోలేదు. ఆ సినిమాలో రజనీకాంత్ రెండు డిఫరెంట్ షేడ్స్ తో కూడిన పాత్రలను చేశారు. వాటిలో ఎంతమాత్రం మానవత్వం లేని శాడిస్టు రాజావారి పాత్ర ఒకటి. ఆ పాత్రలో రజనీ వాకింగ్ స్టైల్ విశేషంగా ఆకట్టుకుంది. అదే విషయాన్ని గురించి, నిన్నరాత్రి జరిగిన ‘చంద్రముఖి 2’ ప్రీ రిలీజ్ ఈవెంటులో లారెన్స్ ప్రస్తావించాడు.

ఈ సినిమాలో తన వాకింగ్ స్టైల్ చూసి రజనీ కాంత్ స్టైల్ మాదిరిగా అనిపిస్తుందనీ .. కొంచెం మార్చమని వాసుగారు అన్నారు. తాను ఎంత ప్రయత్నించినా తన వల్ల కాలేదనీ, ఎందుకంటే తాను చిరంజీవిగారిని చూసి డాన్స్ నేర్చుకున్నాననీ .. రజనీకాంత్ గారిని చూసి స్టైల్ నేర్చుకున్నానని చెప్పాడు. తన బాడీలో రజనీ స్టైల్ తన నుంచి విడదీయలేనంతగా కలిసిపోయిందనీ, దాంతో ‘ఎలా నవాడవాలో మీరే చూపించండి’ అని తాను వాసుగారితో అన్నానని చెప్పాడు.

అప్పుడు వాసుగారు నడిచి చూపించారనీ .. అయితే ఆయన నడకలోను రజనీ స్టైల్ కనిపించిందని అన్నాడు. వాసు గారు రజనీ కాంత్ గారితో ఎక్కువ సినిమాలు చేసి ఉండటం వలన, ఆయన ప్రభావం వాసుగారిపై కూడా పడిందని చెప్పాడు. ఈ తరహా పాత్రలలో రజనీ సార్ ప్రభావం పడకుండా .. ఆయనను అనుకరించకుండా ఉండటం చాలా కష్టమైన విషయమని అన్నాడు. రజనీ సార్ పోషించిన పాత్రను చేయడం తన అదృష్టంగా భావిస్తున్నాననీ, నిజంగా తనకి చాలా గర్వంగా ఉందని  అన్నాడు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్