Sunday, November 24, 2024
HomeTrending Newsఆదానీ వ్యవహారంలో సమగ్ర విచారణకు విపక్షాల డిమాండ్

ఆదానీ వ్యవహారంలో సమగ్ర విచారణకు విపక్షాల డిమాండ్

ఆదానీ ఆర్థిక కుంభకోణాలపై సమగ్ర విచారణ జరిపించాలని,ఇందుకు గాను సంయుక్త పార్లమెంటరీ సంఘాన్ని (జేపీసీ)నియమించాలంటూ టీఎంసీ,ఆప్, డీఎంకే ఎంపీలతో కలిసి బీఆర్ఎస్ పార్లమెంటు సభ్యులు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇందులో భాగంగా సోమవారం పార్లమెంట్ సమావేశాల నుంచి వాకౌట్ చేసి మహాత్మాగాంధీ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. సీబీఐ,ఈడీ,ఐటీలను దుర్వినియోగం చేస్తూ ప్రతిపక్ష పార్టీలకు చెందిన ప్రముఖులు,నాయకులపై తప్పుడు కేసులు బనాయించడం,దాడులకు దిగడం, భయభ్రాంతులకు గురి చేయడాన్ని ఎంపీలు తీవ్రంగా ఖండించారు.

ఈ నిరసన కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు  బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే.కేశవరావు,లోకసభలో బీఆర్ఎస్ పక్ష నాయకులు నామా నాగేశ్వరరావు, ఎంపీలు సంతోష్ కుమార్,కే.ఆర్.సురేష్ రెడ్డి,బడుగుల లింగయ్య యాదవ్, ప్రభాకర్ రెడ్డి, డాక్టర్ బోర్లకుంట వెంకటేష్,రంజిత్ రెడ్డి, వద్దిరాజు రవిచంద్ర తదితరులు పాల్గొన్నారు. ప్రధాన మంత్రి అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. రానున్న 2024 ఎన్నికలలో ప్రజాక్షేత్రంలో బీజేపీకి ఘోర పరాభావం తప్పదని విపక్ష నేతలు హెచ్చరించారు.

Also Read : ఆదాని కంపెనీలపై దర్యాప్తు జరపాల్సిందే  ఎమ్మెల్సీ కవిత

RELATED ARTICLES

Most Popular

న్యూస్