Saturday, July 27, 2024
Homeస్పోర్ట్స్NZ-SL: తొలి టెస్టులో కివీస్ విజయం

NZ-SL: తొలి టెస్టులో కివీస్ విజయం

శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో న్యూజిలాండ్ రెండు వికెట్ల తేడాతో విజయం సాధించింది.  గెలుపు కోసం 285 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్ నిన్న నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ఒక వికెట్ కోల్పోయి  28 పరుగులు చేసింది.  ఓపెనర్ టామ్ లాథమ్ 25, హెన్రీ నికోలస్ 20 పరుగులు చేసి ఔటయ్యారు.  కేన్ విలియమ్సన్-డెరిల్ మిచెల్ లు నాలుగో వికెట్ కు 142 పరుగుల భాగస్వామ్యంతో జట్టును విజయ తీరాలవైపు నడిపించారు.  మిచెల్  81 రన్స్ సాధించి పెవిలియన్ చేరాడు.

ఈ సమయంలో లంక బౌలర్లు మ్యాచ్ పై పట్టు బిగించే ప్రయత్నం చేశారు. టామ్ బ్లండెల్-3; మైఖేల్ బ్రేస్ వెల్-10; టిమ్ సౌతీ-1; మాట్ హెన్రీ-4.. లు తక్కువ స్కోరు కే వెనుదిరగడంతో కివీస్ శిబిరంలో ఆందోళన నెలకొంది. కానీ  విలియమ్సన్ బాధ్యాయుతంగా ఆడి121 పరుగులతో   నాటౌట్ గా నిలిచి జట్టును  గెలిపించాడు.

లంక బౌలర్లలో ఆశిత ఫెర్నాండో 3; ప్రభాత్ జయసూర్య-2; రాజిత, లాహిరు కుమారా చెరో వికెట్ పడగొట్టారు.

శ్రీలంక తొలి ఇన్నింగ్స్ :         355 (కుశాల్ మెండీస్-87; కరుణరత్నే-50; మాథ్యూస్-47; ధనుంజయ డిసిల్వా-46)
వికెట్లు (సౌతీ-5;మాట్ హెన్రీ -4; బ్రేస్ వెల్-1)

కివీస్ తొలి ఇన్నింగ్స్:            373 (డెరిల్ మిచెల్-102;  మాట్ హెన్రీ -72; టామ్ లాథమ్-67)
వికెట్లు (ఆశిత ఫెర్నాండో-4; లాహిరు కుమార-3; రజిత-2)

శ్రీలంక రెండో ఇన్నింగ్స్:       302 (మాథ్యూస్-115; ధనుంజయ డిసిల్వా-47; చండిమల్-42; కరుణరత్నే-50)
వికెట్లు (థిక్నర్ -4; సౌతీ-2;మాట్ హెన్రీ -3)

డెరిల్ మిచెల్ కు ‘ప్లేయర్ అఫ్ ద మ్యాచ్’ దక్కింది.

రెండు టెస్టులతో పాటు మూడు వన్డేలు, మూడు టి 20 మ్యాచ్ ల సిరీస్ కోసం శ్రీలంక జట్టు న్యూజిలాండ్ లో పర్యటిస్తోంది. ఈ టెస్ట్ మ్యాచ్ క్రిస్ట్ చర్చ్ లోని హేగ్లీ మైదానంలో జరగ్గా రెండో టెస్ట్ మార్చి 17నుంచి వెల్లింగ్టన్ లోని బేసిన్ రిజర్వు మైదానంలో జరగనుంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్